OG Movie Twitter Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం నిన్న ప్రీమియర్ షోస్ తో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ చిత్రం కావడం తో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అనే భయం అభిమానుల్లో ఉండేది. పైగా రెండు నెలల క్రితం విడుదలైన ‘హరి హర వీరమల్లు’ పెద్ద ఫ్లాప్ అవ్వడం వల్ల అభిమానుల్లో ఓజీ సూపర్ హిట్ అవుతుందా లేదా అనే చిన్నపాటి టెన్షన్ ఉండేది. కానీ నిన్న ప్రీమియర్స్ షోస్ లో ఫ్యాన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక మామూలు ఆడియన్స్ కి పర్వాలేదు, బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోల్చుకుంటే చాలా బెటర్ అని విశ్లేషకులు సైతం చెప్తున్నారు.
Perfect !!!#BlockbusterOG #TheyCallHimOG
pic.twitter.com/qPlNsFqgJJ— Pk3Vk – GnanaVarsha (@DigitallyGV) September 25, 2025
అయితే ఈమధ్య కాలం లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాని అయితే ట్విట్టర్ టాక్ కాస్త ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాకు ట్విట్టర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్ కి, ఇతర హీరోల అభిమానులకు సూపర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి ఒక్కొక్కరు మెంటలెక్కిపోయారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆరంభం 30 నిమిషాలు బాగుందని, కానీ ఆ తర్వాత బాగా డౌన్ అయిపోయిందని, మళ్లీ క్లైమాక్స్ బాగా పేలిందని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ట్విట్టర్ లో ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాకు నెగటివ్ టాక్ తక్కువ, పాజిటివ్ టాక్ ఎక్కువ. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత పవన్ సినిమాకు ఈ రేంజ్ పాజిటివ్ రివ్యూస్ రావడం ఈ చిత్రానికే జరిగింది. కానీ పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ అని కూడా చెప్పలేము. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు అసలు బాగాలేవు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
Want better sleep?
1️⃣ Stick to a consistent bedtime routine.
2️⃣ Avoid screens 1 hr before bed.
3️⃣ Keep your room cool & dark.
4️⃣ Book a ticket for #TheyCallHimOG— Coding Babu (@Ramabhakth_DHFM) September 25, 2025
కానీ ఒక్కసారి అయితే చూడొచ్చు, మంచి థియేట్రికల్ అనుభూతి ని ఇచ్చే సినిమా అని అంటున్నారు. టాక్ బాగుండడం తో బుక్ మై షో లో కూడా టికెట్ సేల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి గంటకు 30 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నూన్ షోస్ కి ఈ రేంజ్ ఉంటే, ఫస్ట్ షోస్ నుండి వేరే లెవెల్ ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం, మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు ని సాధించిన చిత్రం గా నిలుస్తుందని, వీకెండ్ వరకు ఎలాంటి ఢోకా లేకుండా ఆడేస్తుందని, ఆ తర్వాత నార్మల్ ఆడియన్స్ ఎంత వరకు తీసుకెళ్తారో చూడాలని అంటున్నారు నెటిజెన్స్.
#TheyCallHimOG pure fan service
Pawan Kalyan’s best performance in recent times @MusicThaman did a really great job
Bgm + action scenes
And it’s officially S.C.U
— Akash (@Xyne_Op) September 25, 2025
Prathiokka Sainik intlo #Pawanakalyan photo pakkana #Sujeeth photo lekapothey me antha kojja vallu inkokudu undadu ⚰️⚰️ #TheyCallHimOG
— NTRfreak._. (@viratian_1_8) September 25, 2025