OG Movie Shooting: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతుంది. దీంతో మేకర్స్ ఇక నాన్ స్టాప్ గా అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు, ‘హరి హర వీరమల్లు’ గాయం నుండి తొందరగానే తేరుకుంటాము అంటూ ఎంతో సంతోషపడ్డారు ఫ్యాన్స్. మూవీ టీం కూడా ప్రొమోషన్స్ ని ‘ఫైర్ స్ట్రోమ్’ సాంగ్ తో గ్రాండ్ గా మొదలు పెట్టారు. ఆ పాట ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టాప్ లోనే ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పాట విడుదలై 20 రోజులు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మరో అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
Also Read: ఓజీ vs అఖండ 2 పోటీలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
అయితే నిన్ననే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, DVV సంస్థ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ వేయగా, ఆ పోస్టు క్రింద పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ మూవీ అప్డేట్ ఇవ్వమంటూ గోల చేశారు. దీంతో రెండు రోజుల్లో పాట విడుదల తేదీ ప్రకటన ఉంటుందని, వచ్చే వారం లో పాట ఉంటుందని చెప్పుకొచ్చింది మూవీ టీం. అంటే వచ్చే వారం 27న వినాయక చవితి పండుగ కాబట్టి, ఆ రోజు ఈ సినిమాకు సంబందించిన పాట విడుదల అవుతుందని అభిమానులు డీ కోడ్ చేసుకున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా నాలుగు రోజుల వరకు బ్యాలన్స్ ఉందట. అది కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చిత్రీకరించాల్సి ఉందట.
Also Read: రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను జరుపుకున్న అఖండ 2…
గత వారం లోనే షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా, సినీ కార్మికుల సమ్మె కారణం గా షూటింగ్స్ బంద్ అవ్వడం తో అది సాధ్యం కాలేదని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆయన డేట్స్ ఇస్తే వచ్చే వారం షూటింగ్ ని పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు. మరి ఆయన డేట్స్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ అటు ఇటు జరిగి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోతే మాత్రం ఈ సినిమా వచ్చే నెల 25 న విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు కాబట్టే, మేకర్స్ రెండవ పాట విడుదలని కూడా హోల్డ్ లో పెట్టారని, లేదంటే
ఆగష్టు 15న విడుదల చేసి ఉండేవారని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఇంకా ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో చూడాలి.