OG Vs Akhanda 2 Updates: పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సంవత్సరం వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక రీసెంట్ గా ఓటిటి లోకి వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోతోంది. కాబట్టి ఇప్పుడు రాబోతున్న సినిమాలతో ఎలాగైన సరే సూపర్ సక్సెస్ లను సాధించి తన అభిమానెల కండ్లల్లో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడట…ఇక దానికోసమే సుజీత్ తో చేసిన ఓజీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్కును ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన ఔట్ పుట్ బాగా వచ్చేలా చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సినిమాల మీద ఫోకస్ అయితే చేస్తున్నాడు. తన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలను చేస్తుండడం విశేషం…మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన ఓజీ సినిమాతో సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చాడు.
Also Read: చిరంజీవి లైనప్ మామూలుగా లేదుగా..?ఈసారి కొత్త మెగాస్టార్ కనిపించబోతున్నాడా..?
మరి ఇప్పుడు ఆయన చేస్తున్న అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓజీ, అఖండ 2 రెండు కూడా ఒకే డేటున వస్తుండడం వల్ల ఈ రెండు సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాను పోస్ట్ పోన్ చేసుకోబోతున్నారు అంటు గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే ఈ సినిమాని ఇంకాస్త ఎఫెక్టివ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయించాలనే ఉద్దేశ్యంతోనే పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారట.
Also Read: రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను జరుపుకున్న అఖండ 2…
ఇక పవన్ కళ్యాణ్ తో పోటీపడి తమ సినిమాని భారీ సక్సెస్ గా నిలపడం కూడా కష్టం అనే ఉద్దేశ్యంతో కూడా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మొత్తానికైతే అఖండ 2 సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…