OG Film Director Sujeeth: 2027 వ సంవత్సరం లో విడుదల అవ్వబోయే చిత్రాల్లో , అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఓజీ 2’. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడో లేదో అనే అయోమయ్యాం లో ఉన్న సమయంలో ఈ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి , ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతాడని కూడా పవన్ కళ్యాణ్ టీం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నిన్నటి నుండి మొదలయ్యాయి. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి స్టోరీ ని వినిపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాలో భారీ మార్పులు రాబోతున్నాయి.
ముఖ్యంగా మొదటి భాగాన్ని నిర్మించిన దివీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ , సీక్వెల్/ ప్రీక్వెల్ నిర్మాణం లో భాగం అవ్వడం లేదు. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ కి ఈ టీం సినిమా విడుదల సమయం లో అసలు సహకరించలేదట. చాలా ఇబ్బందులకు గురి చేశారట. సినిమాలో అత్యంత ముఖ్యమైన జపాన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి బడ్జెట్ కోరగా, నిర్మాత అందుకు నిరాకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటిపోయిందని , అంతకు మించి పెట్టలేమని చెప్పడం తో , సుజిత్ తన సొంత డబ్బులు ఖర్చు చేసి జపాన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసుకొని వచ్చాడు. ఆ సన్నివేశాలు షూట్ చేయడం కోసం తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారుని కూడా అమ్మేసుకున్నాడు. అంతే కాకుండా సినిమా ఎడిటింగ్ చేస్తున్న సమయం లో , కనీసం స్టూడియో ని కూడా ఏర్పాటు చేయలేదట మూవీ టీం. దీంతో చివరి నిమిషం వరకు , తన వద్ద ఉన్న లిమిటెడ్ సోర్స్ తోనే సుజిత్ ఎడిటింగ్ ని పూర్తి చేయాల్సి వచ్చిందట.
ఫలితంగా ఓవర్సీస్ కి ప్రింట్లు చాలా ఆలస్యం గా వెళ్లడమే. దాదాపుగా 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి రాబట్టింది ఈ చిత్రం. ఒక్క గంట ఆలస్యం ప్రింట్స్ వెళ్లడం ఆలస్యం అయ్యుంటే , దాదాపుగా 1 మిలియన్ డాలర్లకు సంబంధించిన బుకింగ్స్ రద్దు అయ్యేవి. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం లో డబ్బులు ఆఫర్ చేయడం తో , హిందీ వెర్షన్ తో కలిపి కేవలం నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు నిర్మాత. అందువల్ల, హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ సినిమా విడుదలని బ్యాన్ చేశారు. దాని వల్ల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఓజీ రేంజ్ ని దానయ్య బాగా తగ్గించేసాడనే బాధ సుజిత్ లో అలా ఉండిపోయింది అట. అందుకే ‘ఓజీ 2’ దానయ్య తో చేయడానికి ఆసక్తి చూపలేదని , ఇప్పుడు ఈ చిత్రాన్ని పవన్ క్రియేటివ్ వర్క్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయని టాక్.
