OG Movie OTT Release Date: భారీ అంచనాల నడుమ విడుదలై థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకోవచ్చని నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. నేటి తో నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నేడు అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమా ఓటీటీ లో అందుబాటులోకి రానుంది. తెలుగు తో పాటు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
విడుదలకు ముందు నాలుగు వారాల ఓటీటీ విండో కి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల, ఓజీ చిత్రాన్ని హిందీ లో ఏ ప్రముఖ నిర్మాత కూడా కొనుగోలు చేయలేదు. కారణం అక్కడి నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒక సినిమా విడుదల అవ్వాలంటే, కచ్చితంగా 8 వారాల ఓటీటీ విండో ఉండాలి. ఓజీ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇవ్వడం తో నాలుగు వారాలకే ఒప్పుకున్నారు. ఫలితంగా ఈ చిత్రం హిందీ లో చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయ్యింది. 50 నుండి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన సినిమా, కేవలం పది కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హిందీ ఆడియన్స్ కి చేరుకోలేకపోయింది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఒక్క విషయం లో కాస్త అసంతృప్తి ఉంది. అయితే ఓటీటీ లో విడుదలయ్యాక కచ్చితంగా హిందీ ఆడియన్స్ కి ఈ చిత్రం చేరుతుందని అభిమానులు ఆశ పెట్టుకున్నారు.
KGF చాప్టర్ 1 , పుష్ప చిత్రాలకు కూడా ఓటీటీ లో విడుదలయ్యాకే ఆ ఫ్రాంచైజ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆడియన్స్ లో కచ్చితంగా ఈ సినిమాలకు సీక్వెల్ కావాలి అనే డిమాండ్ ఏర్పడింది. ఓజీ ని కూడా డైరెక్టర్ సుజీత్ ఒక ఫ్రాంచైజ్ లాగానే తెరకెక్కించాలని అనుకుంటున్నాడు కాబట్టి, మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న మూవీ లవర్స్ కి బాగా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 9 వారాలకు పైగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయితే ఈ సినిమాకు గొప్ప రీచ్ వచ్చినట్టు. హిందీ ఆడియన్స్ మరియు ఓవర్సీస్ లోని పశ్చిమ దేశాలకు సంబంధించిన ఆడియన్స్ ఈ సినిమాని చూడడం మొదలు పెట్టారంటే, సంవత్సరం రోజులకు పైగా ట్రెండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది.