OG Movie: ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చిన చిత్రం ఓజీ(They Call Him OG). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 316 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ ఫుల్ చిత్రం గా నిల్చింది ఓజీ. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమా స్టామినా ని పూర్తి స్థాయిలో మేకర్స్ వాడుకోలేదు అనేది విశ్లేషకుల వాదన. నెట్ ఫ్లిక్స్ నుండి ఫ్యాన్సీ ప్రైజ్ కావాలనే ఆశతో నిర్మాత DVV దానయ్య కేవలం నాలుగు వారాల ఓటీటీ విండో కి ఈ చిత్రాన్ని అమ్మేశాడు. నార్త్ ఇండియా లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ రూల్స్ ప్రకారం సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీ లో విడుదల చెయ్యాలి.
నాలుగు వారాల ఒప్పందం చేసుకుంటే నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల చేయడానికి అంగీకరించరు. సింగల్ స్క్రీన్స్ కి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది అట. అందుకే ఈ సినిమా హిందీ లో మూవీ మాక్స్ థియేటర్స్ లో తప్ప, ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. ఫలితంగా కేవలం 10 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం హిందీ వెర్షన్ నుండి రాబట్టింది. ఒకవేళ నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే కాదు, ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్ లో విడుదల లేకపోవడం వల్ల దాదాపుగా రెండున్నర మిలియన్ కి పైగా డాలర్లను నష్టపోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద యాక్షన్ సినిమాని తీసి, కేవలం స్టాండర్డ్ ఫార్మటు కి మాత్రమే ఈ సినిమాని పరిమితం చేయడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.
నార్త్ అమెరికా లో ఐమాక్స్ షోస్ వల్ల హాఫ్ మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయి. అదే విధంగా ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో ఐమాక్స్ షోస్ నుండే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఇక డైరెక్టర్ సుజిత్ చివరి నిమిషం వరకు ఓవర్సీస్ ప్రింట్స్ పంపకపోవడం, కెనడా లో యార్క్ సినిమాస్ లో విడుదల లేకపోవడం వల్ల మరో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు నష్టం. మొత్తం మీద 416 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, నిర్మాతల నిర్లక్ష్యం కారణంగా వంద కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.