Pushpa Priya Bihar: ఎన్నికలవేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలు నాయకుల మధ్య చోటు చేసుకుంటాయి. పైగా కొన్ని సందర్భాలలో నాయకుల మధ్య సవాళ్లు కూడా వస్తుంటాయి. అయితే ఈ సవాళ్లను కొంతమంది నాయకులు సీరియస్గా తీసుకుంటే.. మరి కొంతమంది నాయకులు పట్టించుకోరు.
బీహార్ ఎన్నికల సమయంలో.. ముఖ్యంగా ప్రచారం జోరుగా సాగుతున్న సందర్భంలో ప్లురల్స్ పార్టీ చీఫ్ పుష్పం ప్రియా చౌదరి చేసిన సందడి మామూలుది కాదు. సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉండేది. ప్రచారాన్ని కూడా విభిన్న శైలిలో నిర్వహించేది. దర్భంగా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసింది. అయితే ఆమె 8వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజయ్ సరోగినే ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. బీహార్ రాష్ట్రానికి కొత్త బ్రాండ్ తీసుకొస్తానని ప్రియా చౌదరి 2020లో ది ఫ్లూరల్స్ పార్టీని స్థాపించారు. 2020లో ఆమె ఏకంగా 148 స్థానాలలో తన అభ్యర్థులను నిలిపారు. అయితే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. అయితే ఈసారి ఏకంగా 243 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలిపారు. అయితే ఈసారి కూడా 2020 నాటికి ఎన్నికల ఫలితమే వచ్చింది.
బీహార్ ఎన్నికల్లో గెలిస్తే మాస్క్ తీస్తానని ఆమె శపథం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు. దాని ద్వారానే ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తేనే మాస్క్ తొలగిస్తానని.. తన ముఖాన్ని బీహార్ ఓటర్లకు చూపిస్తానని పేర్కొన్నారు. కానీ ఆమె ఆ స్థాయిలో శపధం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే బీహార్ ఓటర్లు ఆమె పార్టీకి పట్టం కట్టలేదు. అన్నిటికి మించి దర్భంగా ఓటర్లు ఆమెకు జై కొట్టలేదు. దీంతో ఆమెకు మాస్క్ తీసే అవకాశం రాలేదు.
ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తానని ప్రియా చౌదరి శపథం చేసిన తర్వాత.. మీడియాలో ఈమె గురించి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆమె ఓటర్ల మనసును గెలుచుకోలేకపోయింది. వారి అభిమానాన్ని దక్కించుకోలేకపోయింది. చివరికి మాస్క్ తీయకుండానే ఆమె ఉండిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో ఈసారి నేతల మధ్య ఎటువంటి సవాళ్లు ఎదురు కాలేదు. ప్రియా చౌదరి సవాల్ విసరకపోయినప్పటికీ.. శపథం చేశారు. అయితే దానిని నిలబెట్టుకోలేక పోయారు.