OG Movie First Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో సినిమా మీద బజ్ అయితే భారీ స్థాయిలో పెరిగిపోయింది… ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సెన్సార్ మెంబెర్స్ ‘ ఏ’ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. మరి దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా మీద సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వాళ్లు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు…వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సినిమా ఎలా ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ గా తన జీవితాన్ని కొనసాగించి, ముంబై నగరాన్ని మొత్తం ఏలేస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి అన్ని వదిలేసి ఒక అజ్ఞాతంలో బతుకుతున్నప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారు, ఎవరికోసం వచ్చాడు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. మరి ఈ కథ రొటీన్ గా అనిపించినప్పటికి కథనంలో మాత్రం దర్శకుడు తన వైవిధ్యాన్ని చూపించినట్టుగా తెలుస్తోంది.
అలాగే యాక్షన్ సన్నివేశాల్లో పవర్ స్టార్ తన రేంజ్ స్టామినాను చూపించారట. మొత్తానికైతే ఇందులో ఉన్న ఎలివేషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినట్టుగా తెలుస్తున్నాయి. మరి ఈ సినిమాలో పవర్ స్టార్ ని మరొక రేంజ్ లో మనం చూడబోతున్నాం అంటూ సెన్సార్ మెంబర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
మరి ఇలాంటి ఒక న్యూస్ విన్న తర్వాత పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందమైతే కనబడుతోంది. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హై ఇచ్చే సన్నివేశం అయితే ఉందట. అందువల్లే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ సైతం మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని స్టార్ డమ్ మొత్తాన్ని వాడుకొని మరి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించబోతున్నాడు అంటూ సెన్సార్ మెంబర్స్ అయితే చెబుతున్నట్టుగా తెలుస్తోంది…మరి ఈ సినిమా యావత్తు ప్రపంచ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…