Pawan Kalyan OG Dialogue: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కొద్ది గంటల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది. యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించే దిశగా ముందుకు దూసుకెళుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో ఆయన ఇమేజ్ తార స్థాయికి వెళ్ళబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతోంది…ఇక ఈ ఇయర్ ఇంతకు ముందు వచ్చిన ‘హరిహర వీరమల్లు’ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రతి ఒక్కరి చూపు ఓజీ పైనే ఉంది.
ఇక ఈనెల 24వ తేదీ నైట్ నుంచి ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. మరి ప్రీమియర్ ని చూసిన ప్రేక్షకులు ఎలాంటి స్పందన తెలియజేస్తారు. తద్వారా ప్రేక్షకులందరితో పాటు తన అభిమానులు ఈ సినిమా మీద ఎలా స్పందిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రాడక్షన్ అద్భుతంగా ఉంటుందట. మార్షల్ ఆర్ట్స్ ఫైట్ తో ఆయన ఇంట్రాడక్షన్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా ఆయనకు ఎలివేషన్స్ ఇస్తూ తన దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న శిష్యులు చెప్పే డైలాగులు సైతం ఈ సినిమాలో హైలైట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఓజీ అంటే ఎవరో కాదు ‘ఆయన తలుచుకుంటే నువ్వు నిలబడ్డ చోటే నీ ఆయువు తీసేస్తాడు, నువ్వు పొరపాటుగా మాట్లాడితే ఇక్కడే నిన్ను పాతి పెట్టేస్తాడు’ అంటూ ఒక డైలాగ్ అయితే ఉంటుందట…మరి ఈ డైలాగ్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికి ఇంట్రాడక్షన్ లోనే ఈ రేంజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ పడితే మాత్రం థియేటర్లో ఉన్న అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి…