OG ‘Dude’ song : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ(They Call Him OG) మేనియా నే కనిపిస్తుంది. థియేటర్స్ లో నెల రోజుల క్రితం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే పది రెట్లు ఎక్కువ వచ్చింది అనే చెప్పొచ్చు. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, తమిళం, హిందీ,కన్నడ మరియు మలయాళం ఇండస్ట్రీస్ కి చెందిన వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ ఈ ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్ అవుతూ ఉందంటే, ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ఊహించుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఆల్ టైం రికార్డు వ్యూస్ ని సాధించిన ఇండియన్ సినిమాగా కూడా ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు.
ఇదంతా పక్కన పెడితే మీమర్స్ కి కూడా ఈ చిత్రం ఒక రేంజ్ లో ఉపయోగపడుతుంది. ఎన్ని మీమ్స్ చేసిన క్లిక్ అవుతుండడంతో మీమర్స్ ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఒక మేము బాగా హైలైట్ అయ్యింది. ఈ చిత్రం లో శ్రీయ రెడ్డి(Sriya Reddy), పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) లకు సీక్రెట్ లవ్ స్టోరీ ఉన్నట్టుగా మీమర్స్ తమ టాలెంట్ తో ఎడిట్స్ చేసి అప్లోడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ లో కిక్ శ్యామ్ ‘నీ కంగారు చూస్తుంటే నాకు కొత్త అనుమానాలు వస్తున్నాయి’ అనే డైలాగ్ వేస్తాడు గుర్తుందా?, అంటే శ్రీయ రెడ్డి కి పవన్ కళ్యాణ్ కి మధ్య సినిమాలో సీక్రెట్ రిలేషన్ ఉన్నట్టు ఒక చిన్న లింక్ సుజిత్ అలా పెట్టి వదిలేసాడని, సోషల్ మీడియా లో కొంతమంది మీమర్స్ రుద్దుతున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్, శ్రీయ రెడ్డి ని కలుపుతూ రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘డ్యూడ్’ చిత్రం లోని ‘బూమ్ బూమ్’ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ గా ఆ వీడియో కి జోడించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. అది ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. శ్రీయ రెడ్డి కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియో ని తన స్టోరీ లో షేర్ చేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారిన ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము, మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
https://t.co/1Xdp7Ajifw pic.twitter.com/eG94vQIZS9
— オロチ ⛩️ ▬▬ι═══════ﺤ (@Ojas_Cult) October 26, 2025