OG Movie Collections: సినిమా ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవాలి అంటే చాలా కసరత్తులు చేయాలి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం హీరోగా మారడానికి చాలా కష్టపడ్డాడు…అంటే ఇండస్ట్రీ కి రావడం ఆయనకి ఇష్టం లేకపోయిన వల్ల అన్నయ్య చిరంజీవి మాటకోసం హీరో గా మారాడు. ఒకవేళ తను హీరోగా నిలబడకపోతే అన్నయ్యకి అవమానంగా ఉంటుందని అసలు నటన అంటే ఏంటో తెలుసుకున్నాడట. నటుడు అంటే ఎలా ఉండాలి, ఒక పాత్ర కోసం వాళ్ళు ఎలాంటి కసరత్తులు చేయాలి అనేది తెలుసుకొని మరి వాటన్నింటికి కట్టుబడి తనను తాను ఒక శిల్పంలా చెక్కుకున్నాడు… అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలను చేపట్టాడు. దాంతో పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయనతో సినిమా చేయడం మా కళ అంటూ చాలామంది దర్శకులు ఆయన కోసం కథలను రాసుకుంటున్నారు. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఆయన పాలిటిక్స్ లో ఎంత బిజిగా ఉన్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఈ సినిమా వచ్చేంతవరకు చాలామంది పవన్ కళ్యాణ్ కి 100 కోట్ల మార్కెట్ కూడా లేదు. అతని మీద ఎందుకని ఆ రేంజ్ లో బడ్జెట్ ను పెడుతున్నారు.
అతనిచ్చే తక్కువ డేట్లతో మీరు ఎలాంటి సినిమా చేయగలరు అంటూ కొంతమంది హేళనగా మాట్లాడారు. అయినప్పటికి సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తే వర్కౌట్ అవుతుందో ఆలోచించి ఎలివేషన్స్ తో చాలా గొప్ప గా చూపించాడు.
మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి మార్కెట్ లేదు అని చెప్పిన ప్రతి ఒక్కరి గూబ గుయ్యిమనేలా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాడు… ఓజీ మూవీ ఇప్పటికే 250 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికి సక్సెస్ఫుల్గా రామ్ అవుతూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది… మరో వారం రోజులపాటు ఈ కలెక్షన్ల జోరైతే ఇలాగే కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే 500 నుంచి 600 కోట్ల వరకు ఓజీ సినిమా కలెక్షన్లు రాబట్టబోతోంది అనే విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నప్పటికి సినిమా విషయంలో కూడా అంతే కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఓజీ సినిమాతో అందరు హీరోల లెక్కలను తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ హైప్ చూస్తుంటే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం సూపర్ సక్సెస్ ని సాధిస్తాయని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…