OG Movie Censor Talk: మరో 12 రోజుల్లో టాలీవుడ్ ప్రేక్షకులు, పవన్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పై హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూసి 7 ఏళ్ళు దాటింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన అత్యధిక శాతం రీమేక్ సినిమాలు చేయడం కారణంగా ఒక సెక్షన్ ఆడియన్స్ ఆయనకు దూరం అయ్యారు. ఇప్పుడు ఓజీ చిత్రం తో వాళ్లంతా కం బ్యాక్ అయ్యారు. అందుకు ఉదాహరణ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్. పది రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు ఇంకా 12 రోజుల సమయం ఉన్నప్పటికీ 70 వేల టిక్కెట్లు ఓవర్సీస్ లో అమ్ముడుపోయాయి అంటే సాధారణమైన విషయం కాదు.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అయితే ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యినట్టే. పవన్ కళ్యాణ్ కూడా నిన్నటి నుండి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్తున్నాడు. ఈరోజు లేదా రేపటి లోపు డబ్బింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందట. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి అట. ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చారు అనేది ఇంకా బయటకు తెలియలేదు కానీ, సినిమా మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని, ఈమధ్య కాలం లో ఈ రేంజ్ స్టైలిష్ యాక్షన్ చిత్రాన్ని చూడలేదని, సుజిత్ డైరెక్టర్ గా విశ్వరూపం చూపించాడని, పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్, లుక్స్ మరియు యాక్షన్ అదిరిపోయిందని సెన్సార్ సభ్యులు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆకలి మీద ఉన్నారు. రాజకీయంగా ఎవ్వరూ చూడనంత రేంజ్ ని ఆయన ఈ ఏడాది లో చూసి ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గొప్ప పాలన అందిస్తున్నాడు. అంత వరకు బాగానే ఉంది, కానీ సినిమాల్లో ఈమధ్య కాలం లో కారణాలు ఏదైనా కానీ, ఇతర హీరోలతో పోలిస్తే బాగా వెనకబడ్డాడు. ఇప్పుడు ఆయన కం బ్యాక్ ఇవ్వాలంటే ఓజీ నే సరైనది అని అభిమానులు బలంగా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా విడుదలయ్యే ప్రతీ రాష్ట్రంలోనూ ఆల్ టైం రికార్డ్స్ పెట్టాలని పవన్ ఫ్యాన్స్ కంకణం కట్ట్టుకున్నారు. ఇలాంటి సమయం లో ఈ రేంజ్ కంటెంట్ ఇస్తే థియేటర్స్ బ్రతుకుతాయా?, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే థియేటర్స్ ఓనర్స్, ఎందుకైనా మంచిది మీ థియేటర్స్ కి ఇన్సూరెన్స్ లు చేయించుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.