OG Movie Collection Day 1: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం నిన్న పాజిటివ్ టాక్ తో మొదలై అద్భుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. నైజాం, ఓవర్సీస్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఇలా ప్రతీ ప్రాంతం లోనూ ఈ చిత్రానికి పుష్ప 2, #RRR లతో సమానమైన ఓపెనింగ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ సినిమా మిగిలిన సినిమాలు లాగా భారీ బడ్జెట్ తో, బిగ్ డైరెక్టర్ తో చేసిన సినిమా కాదు. ఒక మామూలు డైరెక్టర్ తో చేసిన సినిమా. కేవలం పవన్ కళ్యాణ్ ఒక ప్రామిసింగ్ సినిమా చేసాడు అనే ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఇంతటి హైప్,క్రేజ్ ఏర్పడింది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన షేర్ వసూళ్లను పరిశీలించి చూద్దాం. సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని అనేక బి,సి సెంటర్స్ లో ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు.
అనకాపల్లి వంటి సెంటర్స్ లో ‘హరి హర వీరమల్లు’ కంటే తక్కువ ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర సెంటర్స్ లలో పాటలు లేకపోతే ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు. కానీ సిటీస్ లో మాత్రం ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేసుకున్నాయి. ఇక నైజాం ప్రాంతం లో అయితే అందరూ ఊహించినట్టే ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. రిటర్న్ GST కలిపి ఈ చిత్రానికి మొత్తం మీద ఈ ప్రాంతం లో 27 కోట్ల రూపాయిలు వచ్చినట్టు సమాచారం. అదే విధంగా సీడెడ్ లో 8 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్ర లో 7 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 7 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల 30 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్ల 11 లక్షలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కలిపి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలు కలిపి దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 105 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ కి ఇది మొట్టమొదటి వంద కోట్ల షేర్ సినిమా. నిన్న మొన్నటి వరకు అందరూ పవన్ ని 100 కోట్ల షేర్ లేదని తెగ వెక్కిరించేవాళ్ళు. కానీ ఇప్పుడు మొదటి రోజే ఆ మార్కుని అందుకొని ఏ స్టార్ హీరో కూడా సాధించని అరుదైన రికార్డుని నెలకొల్పి సంచలనం నమోదు చేసాడు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం తో ఇంకా ఎలాంటి రికార్డ్స్ ని నెలకొల్పుతాడో చూడాలి.