Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు. నెల రోజులకు ముందే సంబరాలు మొదలైపోయాయి. సెప్టెంబర్ 2న నయా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అందరీ కళ్ళు OG టీజర్ పైనే ఉంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. సాహో విడుదలై నాలుగేళ్లు దాటిపోయింది. సుజీత్ మళ్ళీ సినిమా చేయలేదు. ఏళ్ల తరబడి పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ తో అద్భుతమైన ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు.
నేడు ఓజీ యూనిట్ మరో అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డేకి కేవలం ఫస్ట్ లుక్ కాదు, టీజరే తీసుకొస్తున్నామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పిస్టల్ పట్టుకున్న పోస్టర్ విడుదల చేశారు. పవన్ చేతిలో ఉన్న టాటూలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక ఓజీ టీజర్ నిమిషానికి పైగా నిడివి ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, లుక్, మేనరిజమ్స్, యాక్షన్ హైలెట్ గా టీజర్ ఉండనుంది.
ఓజీ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం. ఇది బయోపిక్ కూడా అంటున్నారు. ఓ రియల్ గ్యాంగ్ స్టర్ లైఫ్ నుండి స్ఫూర్తి పొంది సిద్ధం చేసిన కథ అంటున్నారు. నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఉన్న పిస్టల్ పాతకాలపు మోడల్. కాబట్టి పీరియాడిక్ మూవీ అనే విషయంపై హింట్ వచ్చేసింది. ఇక ఈ మూవీలో నాలుగైదు భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. పవన్ కళ్యాణ్ ఎంట్రీనే ఏడు నిమిషాల నిడివి కలిగిన యాక్షన్ ఎపిసోడ్ తో ఉంటుందట. పవన్ కళ్యాణ్ కెరీర్లో స్పెషల్ మూవీగా ఉండనుందని అంటున్నారు.
మరో విశేషం ఏమిటంటే… ఓజీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందట. హరి హర వీరమల్లు ఆలస్యం అవుతుండగా పవన్ చేసే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ కానుంది. ఓజీ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. థాయిలాండ్ లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఓ 30 రోజులు నిరవధిక షెడ్యూల్లో పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది.
NO FIRST LOOK… Wanted to give an adrenaline rush with the visuals and BGM. 💥G.
Let’s await for THE #HUNGRYCHEETAH ON SEPTEMBER 2nd. Get your screens and woofers ready. 🔥🔥 #TheyCallHimOG pic.twitter.com/7PimBs3s1N
— DVV Entertainment (@DVVMovies) August 28, 2023