Ajith Kumar: తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోలు విజయ్, అజిత్. ముఖ్యంగా అజిత్ కి అక్కడ వీరాభిమానులు ఉన్నారు. ఆయన సింప్లిసిటీ.. మెస్మరైజింగ్ యాక్టింగ్ కి అక్కడి వారి ఫిదా అయిపోతూ ఉంటాడు.
అజిత్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అని.. అందుకే ఆయనకి అభిమానులు ఎక్కువ అని కూడా అనేవారు ఉన్నారు. కానీ అలాంటి అజిత్ ఈమధ్య చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆయనపై నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తోంది.
ముఖ్యంగా తమిళ తంబీల వీరాభిమానానికి హద్దులు ఉండవు. తన అభిమాన హీరో కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకే తమిళనాడులో ఫ్యాన్ వార్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఐదేళ్లుగా హీరో విజయ్, అజిత్ కోలీవుడ్ లో తిరుగులేని హీరోలుగా ఎదిగారు. వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ఇద్దరు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు.
ఇక ఇప్పుడు అజిత్ చేసిన ఒక పని తో విజయ్ ఫ్యాన్స్ దగ్గర అడ్డంగా బుక్కయ్యారు. అదేమిటి అంటే ఒక ఫ్యాన్ వచ్చి అజిత్ కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆయన వెంటనే వెళ్లి డెటాల్ తో ఆయన చేతులు కడుక్కున్నారు. మరి అజిత్ ఈ పని ఫ్యాన్ కి చెయ్యి ఇచ్చినందువల్ల చేశారా.. లేదా ఇంకేమన్నా కారణం వల్ల చేశారా తెలియదు కానీ.. అజిత్ చేసిన ఈ పని మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.
ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ విజయ్ తన అభిమానులను కౌగిలించుకున్న ఫోటోలతో పాటు అజిత్ ఇలా చేయి కడుక్కునే ఫోటో పెట్టి.. ఇదేమి వైనం అంటూ అజిత్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు.
ఒక హీరోని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికిన మరో హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అజిత్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మరి ఈ విషయంపై అజిత్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.