NTR Devara: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఈ హీరో తదుపరి సినిమా పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక మన యంగ్ టైగర్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా దేవర.
ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇక ప్రస్తుతం అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయట.
ముఖ్యంగా ఈ సినిమాలో ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ ఉంది అని, ఆ సీక్వెన్సీ సినిమాకి హైలైట్ గా నిలబడి ఉంది అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సముద్రాన్ని తలపించే ఓ పెద్ద ట్యాంకర్ ను తెప్పించి కొన్ని షాట్స్ కూడా షూట్ చేశారని వార్తలు వచ్చాయి. యాక్షన్ కి పెట్టింది పేరు ఎన్టీఆర్.ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
ఇక ఏకంగా ఈ సినిమాలో ఈ అండర్ వాటర్ సీన్ల కోసం ఎన్టీఆర్ కి కఠినమైన ట్రయినింగ్ ఇవ్వడానికి సిద్ధమైపోయారంట డైరెక్టర్ కొరటాల. ఇక దీనికోసం ఏకంగా ఈరోజు ముంబాయి నుంచి ట్రయినర్లు వచ్చినట్టు సమాచారం. ఇక ఈ వార్త వినగానే ప్రేక్షకులకు ఈ సినిమా పైన అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొరటాల కూడా ఈ చిత్రంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం.
కాగా ఈ చిత్రంలో మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు తమిళ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్నారు.