OG Interval Music: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ చిత్రం ఓజీ(They Call Him OG) బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి,ఈ ఏడాది టాప్ 1 తెలుగు చిత్రంగా నిల్చింది. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయం లో అయితే ట్రేడ్ మొత్తం షాక్ కి గురైంది. ఇతర బాషల సహకారం లేకుండా, కేవలం తెలుగు వెర్షన్ నుండి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం నిజంగా అద్భుతమే. సింగల్ లాంగ్వేజ్ లో ఏ ఇండియన్ సినిమాకు కూడా ఈమధ్య కాలంలో ఇంత ఓపెనింగ్ రాలేదు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పి పవన్ ఫ్యాన్స్ కి మంచి జ్ఞాపకం లాగా నిల్చిపోయింది ఈ చిత్రం. అలాంటి ఈ సినిమాని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్స్ లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేసే విషయం లో నిర్మాతలు విఫలం అయ్యారు. కానీ ఓటీటీ లో మాత్రం ఈ చిత్రం పాన్ ఇండియన్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుంది. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు. అయితే ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాకి అయినా ఇష్టపడేవాళ్లు ఎంత మంది ఉంటారో, విమర్శించేవాళ్ళు కూడా అంత మంది ఉంటారు. ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత నెటిజెన్స్ కొన్ని లోపాలను కనిపెట్టారు. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని సన్నివేశాల్లో కాపీ కొట్టాడు అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఉదాహరణకు ఇంటర్వెల్ సన్నివేశం లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. అభిమానులు మెంటలెక్కిపోయారు. కానీ ఒక షాట్ లో థమన్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ మ్యూజిక్ ని వాడేసాడు.
బాగా గమనిస్తే అసలు ఆయన ఆ ఒక్క బిట్ ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్టు అనిపించలేదు, నేరుగా స్ట్రేంజర్ థింగ్స్ మ్యూజిక్ థీమ్ ని వాడేసినట్టుగా అనిపించింది. విమర్శకులు ఇదే గమనించారు. అంతే కాదు, థమన్ మిక్సింగ్ అనేక సన్నివేశాల్లో బాగా అనిపించలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘ఓజీ 2’ అని పడేటప్పుడు ప్రత్యేకమైన మ్యూజిక్ ట్రాక్ వాడుంటే బాగుండేది అని, సినిమా ప్రారంభం నుండి ఉన్నటువంటి ‘హంగ్రీ చీతా’ థీమ్ ని ఉపయోగించడం వల్ల రిపీట్ అయిన ఫీలింగ్స్ కలిగిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా డైరెక్టర్ సుజిత్ చేసిన తప్పులను కూడా సోషల్ మీడియా లో విమర్శకులు ఎట్టి చూపించారు. అవి కూడా చూసేందుకు చాలా ఫన్నీ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ‘ఓజీ’ మేనియా నే నడుస్తుంది. చూడాలి మరి ఈ చిత్రం ఎన్ని ఓటీటీ రికార్డ్స్ ని రాబోయే రోజుల్లో బద్దలు కొట్టబోతోంది అనేది.