OG Profit: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ప్రస్తుతం లాభాల్లో నడుస్తుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చడం తో ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమాని జెన్ Z ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని తెరకెక్కించారు. వాళ్లకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో గత రెండు నెలల నుండి ఎక్కడ చూసినా ఓజీ మేనియా నే కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ మరియు దీపావళి వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డొమెస్టిక్ మార్కెట్ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా ఓవర్సీస్ లో తెచ్చిపెట్టిన లాభాలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మూడు సంవత్సరాల క్రితమే నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని 17 కోట్ల రూపాయలకు ఓవర్ సీస్ హక్కులను అవుట్ రైట్ గా అమ్మేశాడు. అప్పటి మార్కెట్ కి 17 కోట్లు అంటే ఎక్కువ. కానీ కాలక్రమేణా మన టాలీవుడ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోల క్రేజ్ ఉన్న సినిమాలకు కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు నుండి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే స్థాయికి మన టాలీవుడ్ మార్కెట్ ఎదిగింది. ఓజీ చిత్రానికి విడుదలకు ముందు ఎలాంటి ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ కారణంగా ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని సాధించింది. ఇక ఆ తర్వాత క్రిటిక్స్ నుండి యావరేజ్ రేంజ్ రివ్యూస్ రావడం తో ఫుల్ రన్ వసూళ్లు కూడా కుమ్మేసాయి. ఓవర్సీస్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఓవర్సీస్ మొత్తం కలిపి 7.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అన్నమాట. షేర్ వసూళ్లు దాదాపుగా 36 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. అంటే పెట్టిన డబ్బులకు రెండింతలు లాభాలు అన్నమాట. గడిచిన పదేళ్లలో ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ లాభాలు రావడం కేవలం ఓజీ చిత్రానికే జరిగింది. నార్త్ అమెరికా లో 5.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, యునైటెడ్ కింగ్డమ్ + ఐర్లాండ్ కలిపి 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు, గల్ఫ్ కంట్రీస్ నుండి 4 లక్షల 60 వేల డాలర్లు, ఓషియానా నుండి 4 లక్షల 25 వేల డాలర్లు, మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల నుండి 4 లక్షల 20 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి 8 మిలియన్ డాలర్ల మార్కుని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.