OG Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి సంచలనమైన రికార్డ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వరల్డ్ వైడ్ గా ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రం సరికొత్త బెంచ్ మార్కు ని క్రియేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. రెండు నెలల క్రితమే ‘హరి హర వీరమల్లు’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తో అభిమానులను నిరాశ పర్చిన పవన్ కళ్యాణ్, ఇంత తక్కువ గ్యాప్ లోనే ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో మాస్ కం బ్యాక్ ఇవ్వడం నిజంగా ఆయన అభిమానులు గర్వించదగినదే. అయితే ఈ సినిమా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. అలాంటి థియేటర్స్ లో ఒకటి హైదరాబాద్ లోని మాస్ మహారాజ రవితేజ ‘ART సినిమాస్’.
ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి రవితేజ నిమరించిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో ఓజీ ఇరగబడి ఆడేస్తుంది. ఈ మల్టీప్లెక్స్ లో VEPIQ స్క్రీన్ ఉండడం తో, హైదరాబాద్ జనాలు ఓజీ చిత్రాన్ని ఇందులో చూసేందుకు అమితాసక్తి ని చూపిస్తున్నారు. విడుదలైన 8 రోజుల్లో ఈ చిత్రం ఈ థియేటర్ నుండి కోటి 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ థియేటర్ లో ప్రదర్శించిన ప్రతీ ఓజీ షో హౌస్ ఫుల్ అవ్వడం గమనించాల్సిన విషయం. భవిష్యత్తులో ఈ రికార్డు ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు అని అనలేము కానీ, రవితేజ కి మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం . రాబోయే రోజుల్లో రెండు కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది.