OG Collection Day 10: నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై సోషల్ మీడియా లో వంద కోట్ల షేర్ సినిమా లేదని యాంటీ ఫ్యాన్స్ నుండి ఒక రేంజ్ లో ట్రోల్స్ పడేవి. కానీ ఇప్పుడు ఆయన ఓజీ(They Call Him OG) సినిమాతో 200 కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరబోతున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుండే అభిమానుల్లో మునుపెన్నడూ లేని జోష్ కనిపించింది. మొదటి గ్లింప్స్ రిలీజ్ నుండి సినిమా రిలీజ్ వరకు ప్రతీ ఒక్కటి ఒక పండుగ లాగా జరిపారు. ఇక సినిమా విడుదల రోజున వాళ్ళ అంచనాలను మ్యాచ్ చేయడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో , సుజిత్ అంతకు మించే చూపించాడు. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కూడా, పవన్ కళ్యాణ్ ని బాగా చూపించడంతో అభిమానులకు కడుపు నిండిపోయింది.
వాళ్ళ నుండి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం తో పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 10 రోజుల్లో 170 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నేటితో 175 కోట్ల షేర్ మార్కుని దాటనుంది. సినిమాకు స్టడీ రన్ ఉంది కాబట్టి, దీపావళి వరకు ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నైజాం ప్రాంతం లో అప్పటి వరకు రన్ రావడం కష్టమే కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆ రేంజ్ లో ఆడితే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 200 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అప్పటికీ కూడా ఈ సినిమా మూడు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అనే టాక్ వినిపిస్తుంది.
ఆ మూడు ప్రాంతాలు సీడెడ్, ఉత్తరాంధ్ర మరియు నెల్లూరు. ఈ మూడు ప్రాంతాల్లో చిత్రం బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వస్తుంది కానీ, ఆ మార్కుని అందుకునే అవకాశాలు ప్రస్తుతానికి లేవనే చెప్పాలి. ఈ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కి తక్కువ ఛాన్స్ ఉండడానికి ప్రధాన కారణం సరైన థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కాకపోవడమే. అక్కడి బయ్యర్స్ సరిగా లేరని, చెత్త థియేటర్స్ లో ఓజీ ని రిలీజ్ చేసారని, ఓపెనింగ్స్ దగ్గర నుండే ఈ మూడు ప్రాంతాల్లో పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు.