OG Censor Report: మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను నేడు పూర్తి చేశారు మేకర్స్. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ని జారీ చేశారు. కొన్ని కట్స్ ని కూడా విధించారు. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ, వాటిని అలాగే ఉంచేయాలంటే కచ్చితంగా A సర్టిఫికేట్ వచ్చేది. కానీ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు రావాలంటే కచ్చితంగా UA కావాలి. అందుకే మేకర్స్ UA కోసమే ఫైట్ చేసి తెచ్చుకున్నారు. అయితే యాక్షన్ మూవీ లవర్స్ ఈ చిత్రం లో బ్లడ్ బాత్ ఉంటుందని ఊహించాము, A సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నాము, కానీ UA వచ్చింది అంటూ కాస్త నిరాశకు గురయ్యారు.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్ ని ఒకసారి పరిశీలిద్దాం. వాళ్ళు చెప్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉంటుందని, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ లో ఉంటుందని, అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ది బెస్ట్ మూవీ ఇదే అని, సినిమాలో ఆయనకు పడే ఎలివేషన్ సన్నివేశాలకు ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారని, సినిమాలో మొత్తం 5 సన్నివేశాలు బ్లాస్టింగ్ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇదే టాక్ నిజమైతే ఉన్న హైప్ కి ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.
ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ మొదటి రోజు జీవో ని విడుదల చేశారు. బెనిఫిట్ షోస్ కి వెయ్యి రూపాయిల టికెట్ రేట్, అదే విధంగా రెగ్యులర్ షోస్ కి సింగిల్ స్క్రీన్స్ లో 272 రూపాయిలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 327 రూపాయిలను ఫిక్స్ చేసినట్టు సమాచారం. 11 వ రోజు నుండి స్టాండర్డ్ గవర్నమెంట్ రేట్స్ ఉంటాయట. ఇక తెలంగాణ లో కూడా ఇదే రేంజ్ జీవో వస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్. రేపటి లోపు ఈ జీవో కూడా వచ్చే అవకాశం ఉందని, ఈ వీకెండ్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడతారని అంటున్నారు మేకర్స్.