OG 2 Producers Latest News: కెరీర్ లో అతి ముఖ్యమైన సమయంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి బాగా ఉపయోగపడిన సినిమా ‘ఓజీ’. రీమేక్ సినిమాలు, నాసిరకమైన సినిమాలు చేస్తూ, తన సూపర్ స్టార్ స్టేటస్ ని నాశనం చేస్తున్నాడు అని అభిమానులు మొదటి నుండి బాధపడుతూ ఉండేవారు. అలాంటి అభిమానులకు ఈ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు అభిమానులను సంతృప్తి పరిచింది. కానీ ఒకే ఒక్క వెలతి అభిమానుల్లో అలాగే మిగిలిపోయింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేస్తారని ఆశించారు, కానీ అది జరగలేదు. సుజిత్ కూడా ఈ విషయం లో నిర్మాతల తీరుకి చాలా బాధపడ్డాడు. అందుకే ‘ఓజీ 2’ చిత్రం ఈసారి DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కడం లేదు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ కి ఈ చిత్రం షిఫ్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ అంటే అందరికీ తెలిసిందే, ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ తో పాటు, ప్రభాస్ సన్నిహితులు ఈ బ్యానర్ ని రన్ చేస్తున్నారు. వాళ్ళ బ్యానర్ లో ‘ఓజీ 2’ నిర్మాణం జరగబోతుండడం అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చే న్యూస్. అంతే కాదు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ తో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగం కాబోతున్నాడు అట. యూవీ క్రియేషన్స్ తో పవన్ కళ్యాణ్ కేవలం ‘ఓజీ 2’ మాత్రమే కాదు, మరో సినిమా చేయడానికి కూడా సంతకం చేసాడని టాక్. త్వరలోనే ‘ఓజీ 2’ సంబంధించిన అప్డేట్ ని యూవీ క్రియేషన్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయబోతుంది అట. ఉగాది రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సుజిత్ తన ఫోకస్ మొత్తాన్ని నేచురల్ స్టార్ నాని తో చేయబోయే సినిమా మీదనే పెట్టాడు.
ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలి అనేది ప్లాన్. ఇక ‘ఓజీ 2’ చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా ప్రీక్వెల్ తీస్తారా?, లేదా సీక్వెల్ తీస్తారా అనేది పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ ని బట్టి ఆధారపడి ఉంటుందట. ప్రీక్వెల్ అయితే జపాన్ లో అత్యధిక శాతం షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే సీక్వెల్ కోసం అయితే జపాన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. 5 మంది రైటింగ్ టీం అందుకోసం పనిచేస్తున్నారు.