Odela Railway Station 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. మంచి కథలతో ఇండస్ట్రీ కి వస్తున్న యంగ్ డైరెక్టర్లు వరుస సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఇండస్ట్రీ లో చాలా మంచి గిరాకీ అయితే ఉంది. కొత్త దర్శకులతో పాటు కొంతమంది సీనియర్ దర్శకులు సైతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సంపత్ నంది లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి కథ మాటలను అందిస్తూ తన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న కొంతమందిని దర్శకులుగా పరిచయం చేసే బాధ్యతను అయితే ఎంచుకున్నాడు. ఇక ప్రస్తుతం అశోక్ తేజ అని అబ్బాయిని ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘ఓదెల రైల్వే స్టేషన్ 2’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న నేపధ్యంలో రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి అక్కడక్కడ సిజి షాట్స్ గాని, ఈ సినిమాలో చెప్పిన వాయిస్ ఓవర్ గాని అంత పెద్దగా సెట్ అవ్వలేదు. అలాగే విజువల్స్ కూడా మరి భారీ రేంజ్ o అయితే లేవు. మరి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పుష్కలంగా వస్తున్నాయి.
Also Read : దెయ్యంగా భయపెట్టిన అల్లరి నరేష్..ఆకట్టుకున్న ’12A రైల్వే కాలనీ’ టీజర్!
ఇలాంటి సందర్భంలో వాటన్నింటిని చూస్తూ వస్తున్న ప్రేక్షకులు వాటిని వదిలేసి థియేటర్ కి వచ్చి ఓదెల రైల్వే స్టేషన్ 2 సినిమాని చూడాలి అంటే ఇందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండాలి. ఇక దేవుడికి దయ్యానికి మధ్య జరిగే ఈ బీకర యుద్ధాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఇలా కనక చేసినట్లయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి దర్శకుడు మంచి సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదగాల్సిన అతను స్టార్ హీరోలతో సినిమాలైతే చేయలేకపోతున్నాడు. కెరియర్ మొదట్లోనే రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసి ఆవరేజ్ సక్సెస్ ని అందుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు మరో స్టార్ హీరో తో సినిమా అయితే చేయలేకపోయాడు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో ఆయన చాలావరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. తనకంటే తర్వాత వచ్చిన దర్శకులందరు స్టార్ డైరెక్టర్లుగా ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం ఇంకా అరకోర సినిమాలను చేస్తూ ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు…
Also Read : వణుకు పుట్టిస్తున్న తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్..మరో అరుంధతి కానుందా?