12A Railway Colony Teaser : నేటి తరం హీరోలలో కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్(Allari Naresh|). అయితే ఇప్పుడు ఆయన కామెడీ జానర్ సినిమాలను పక్కన పెట్టి, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పాత నరేష్ ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆయన ట్రాక్ మార్చిన తర్వాత కేవలం ‘నాంది’ ఒక్కటే కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కేవలం ప్రయత్నాలుగా మాత్రమే మిగిలుపోయాయి కానీ, ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా దక్కలేదు. ఆయన గత చిత్రం ‘బచ్చలమల్లి’ ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన ’12A రైల్వే కాలనీ'(12A Railway Colony Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మూవీ టీం.
Also Read : షారుఖ్ ఖాన్ తో సుకుమార్..మరి రామ్ చరణ్ సంగతేంటి?
హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘పొలిమేర’ సిరీస్ కి రైటర్ గా వ్యవహరించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథని అందించగా, నాని కసరగడ్డ దర్శకత్వం వహించాడు. పొలిమేర సిరీస్ లో హీరోయిన్ గా నటించిన కామాక్షి(Doctor Kamakshi) ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే టీజర్ ని చూసిన తర్వాత అల్లరి నరేష్ ఇందులో దెయ్యం క్యారక్టర్ చేసినట్టుగా అనిపించింది. ఆయన క్యారక్టర్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏమి కనిపించలేదు కానీ టీజర్ చివర్లో అల్లరి నరేష్ పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ మాత్రం టీజర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే హారర్ చిత్రం కాబట్టి ఏదైనా షాకింగ్ ఎలిమెంట్స్ ని పెట్టి ఉండుంటే ఈ సినిమాపై హైప్ బాగా పెరిగేది విశ్లేషకుల అభిప్రాయం. కనీసం ఈ సినిమాతో అయినా అల్లరి నరేష్ భారీ కం బ్యాక్ ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఆయన కం బ్యాక్ ఇచ్చే విధంగా ఈ టీజర్ మీకు అనిపించిందో లేదో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి.
Also Read : ఒక్క టీజర్ తో 25 కోట్లు..ఆసక్తి రేపుతున్న ‘ఓదెల 2’ మూవీ బిజినెస్!