Nuvvu Naaku Nachav : ‘దేవుడా ఓ మంచి దేవుడా..! నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పిచ్చావ్, బంగాళ దుంప ఫ్రై ఇచ్చావ్… చారు కూడా ఇచ్చావ్’ అంటూ వెంకటేష్ పలికిన ఈ డైలాగ్స్ ఓ తరాన్ని హాస్య ప్రపంచంలో విహరింప చేశాయి. అందుకే, ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) సినిమా ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరేట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే, ఈ సినిమా వెనుక పలు ఆసక్తి సంఘటనలు జరిగాయి.
ఆ రోజుల్లో వెంకటేష్ కామెడీ సినిమాలు చేయడం లేదు. వరుసగా యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. అయితే, సురేష్ బాబుకి ఎప్పటి నుంచో వెంకటేష్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని ఉండేది. వెంకటేష్ కి సరైన పాత్ర పడితే, వెంకీ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అని సురేష్ బాబుకు బాగా తెలుసు.
ఈ క్రమంలో సురేష్ బాబుకి ఒక విషయం తెలిసింది. నిర్మాత స్రవంతి రవికిషోర్ ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే సినిమాని తరుణ్ తో చేయబోతున్నాడని… స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది అని చెప్పారు. మరోపక్క కె.విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారు. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా సినిమా తీయాలనుకున్నారు.
ఇక తరుణ్ కూడా డేట్స్ కూడా ఇచ్చాడు. సినిమాని తరుణ్ తోనే తీస్తే బాగుంటుంది అని అందరూ నమ్మారు. అప్పుడే సురేష్ బాబు నుంచి దర్శక నిర్మాతలకు ఫోన్ వచ్చింది. దాంతో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ లు వెళ్లి సురేష్ బాబుతో పాటు వెంకటేశ్ కు కూడా కథ వినిపించారు. వాళ్లకు కథ బాగా నచ్చింది, అలా సినిమా పట్టాలెక్కింది.
మొత్తానికి తరుణ్ ప్లేస్ లో వెంకటేష్ వచ్చి జాయిన్ అయ్యాడు. ఎలాగూ సినిమా కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ గాను ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.