
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రినితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గడ్కరీకి సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు నిధులు కోరే అవకాశం ఉంది. నూతన జాతీయ రహదారుల నిర్మాణం పై విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంజూరైన హైవేలకు త్వరగా నెంబర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.