Homeఎంటర్టైన్మెంట్Nuvvostanante Nenoddantana sequel update: 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా ' సీక్వెల్ కి రంగం సిద్ధం.. ఈసారి...

Nuvvostanante Nenoddantana sequel update: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ‘ సీక్వెల్ కి రంగం సిద్ధం.. ఈసారి డైరెక్టర్ ఎవరంటే..

Nuvvostanante Nenoddantana sequel update: 2005 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా ఇదే. తొలి సినిమానే ఇంత అద్భుతంగా తీస్తాడని , ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. ముఖ్యంగా ఈ చిత్రం లో సిద్దార్థ్, త్రిష మధ్య కెమిస్ట్రీ ని ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ కెమిస్ట్రీ కారణంగానే ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడు చూస్తూనే ఉంటాము. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు సిద్దార్థ్ , త్రిష లను హీరో హీరోయిన్లు గా పెట్టి ఒక సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా ‘ కి సీక్వెల్ గా తెరకెక్కబోతుంది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది సీక్వెల్ నా? , లేదంటే సెపరేట్ చిత్రమా అనేది దిల్ రాజు స్వయంగా చెప్తే కానీ తెలియదు కానీ, ఒకవేళ సీక్వెల్ అయితే మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండవు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ఈ సినిమాకు ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ చిత్రం కూడా కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు.

సిద్దార్థ్ ఈమధ్య కాలం లో కాస్త డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. కొన్ని సక్సెస్ అవ్వగా, కొన్ని అట్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. కానీ ఒకప్పుడు సిద్దార్థ్ టాలీవుడ్ లో సృష్టించిన సెన్సేషన్ ని ఈమధ్య కాలం లో రీ క్రియేట్ చేయలేదు. కాబట్టి కచ్చితంగా ఈ క్రేజీ కాంబినేషన్ తో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిద్దార్థ్ సంగతి పక్కన పెడితే, హీరోయిన్ త్రిష కెరీర్ ప్రస్తుతం పీక్ రేంజ్ లో ఉంది. వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టడం వల్ల, ఈ సినిమాకు భారీ ప్లస్ గా నిలిచే అంశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular