ఎక్స్ క్లూజివ్ : బావమరిదిని హీరోని చేస్తోన్న ఎన్టీఆర్ !

హీరో అయిపోవాలని, సినిమా రంగంలో ఎలాగోలా ఎంట్రీ ఇచ్చేయాలని చాలామంది కుర్రాళ్లకు ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల కుటుంబాలలోని పిల్లలకు అయితే, మరి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ స్టార్ డమ్, కోట్ల రూపాయల సంపాదన, పైగా గౌరవం, అలాగే బోలెడంత గుర్తింపు. అందుకే ఇప్పుడు ఓ స్టార్ హీరో ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది. హీరో కావాలని కలలు కంటున్న ఆ హీరో ఎవరంటే.. పేరు నితిన్. అన్నిటికీ మించి జూనియర్ […]

Written By: admin, Updated On : May 9, 2021 1:07 pm
Follow us on

హీరో అయిపోవాలని, సినిమా రంగంలో ఎలాగోలా ఎంట్రీ ఇచ్చేయాలని చాలామంది కుర్రాళ్లకు ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల కుటుంబాలలోని పిల్లలకు అయితే, మరి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ స్టార్ డమ్, కోట్ల రూపాయల సంపాదన, పైగా గౌరవం, అలాగే బోలెడంత గుర్తింపు. అందుకే ఇప్పుడు ఓ స్టార్ హీరో ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది.

హీరో కావాలని కలలు కంటున్న ఆ హీరో ఎవరంటే.. పేరు నితిన్. అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ కి స్వయాన బావమరిది. ఎన్టీఆర్ సతీమణి తమ్ముడు. బావగారి రేంజ్ ను చూసిన నితిన్ నార్నే, మొత్తానికి హీరో కావాలని ఆశ పడుతున్నాడు. ఎంతైనా నార్నే ఎస్టేట్స్ నార్నే శ్రీనివాసరావు కుమారుడు కాబట్టి, ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా కూడా హీరో అయిపోవచ్చు.

కాకపోతే ఎన్టీఆర్ కి స్వంత బావమరిది కాబట్టి, ఇతగాడికి ఎన్టీఆర్ అండ లభించడం ఖాయం. ఎన్టీఆర్ తలుచుకుంటే నితిన్ నార్నేను హీరోగా పెట్టి, మంచి డైరెక్టర్ ను సెట్ చేసి సినిమా తీయించడం అనేది చాల ఈజీ. కానీ కుర్రాడు యాక్టింగ్ బాగా చేయకపోతే ముందు బ్యాడ్ నేమ్ ఎన్టీఆర్ కే. అందుకే ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ నేర్పిస్తున్నారట.

యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర ప్రస్తుతం నటనలో మెళకువలు నేర్చుకుంటున్నాడట.అలాగే హీరోగా నితిన్ నార్నే ఎలా వుంటాడు ? అతన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అసలు అతనిలో హీరో మెటీరియల్ వుందా లేదా ? అనే కోణంలో కూడా ఎన్టీఆర్ టీమ్ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బావమరిది త్వరలోనే హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. మొత్తమ్మీద ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యామిలీస్ నుంచి కొత్త హీరోల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.