NTR And Prashanth Neel (1)
NTR And Prashanth Neel: ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాలకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే ఉంటాయి.
Also Read: హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (NTR)కి స్టార్ హీరోగా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంలో కూడా ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో చేస్తున్న సినిమా కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మీద చాలా వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీ కోసం ఆయన చాలా వరకు తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఏదైతే మేకోవర్ కావాలని చెప్పాడో అలాంటి మేకవర్లో కనిపించడానికి ఎన్టీఆర్ తీవ్రమైన కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం చేసిన దేవర సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన మంచి అంచనాలైతే పెట్టుకున్నాడు.
అయితే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కేవలం 500 కోట్ల కనెక్షన్లను మాత్రమే రాబట్టడంతో ఆయన తీవ్రంగా నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు భారీ బజ్ లేకపోవడం వల్లే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. అందువల్లే ఆయన పట్టు బట్టి మరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపైతే ఉంది.
ఇక ఒకసారి ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తే ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉండటమే కాకుండా ఆ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ కలెక్షన్స్ ను కూడా రాబడుతుందనే నమ్మకం ఎన్టీఆర్ లో కలిగింది. అందువల్లే ఆయనతో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమా సైతం రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తో మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రశాంత్ నీల్ సినిమాతో తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉన్నాడు…
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈనెల ఎండింగ్ లో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా భారీ కలెక్షన్స్ కి కొల్లగొడుతుందనే ఆలోచనలో యావత్ సినిమా ఇండస్ట్రీ ఉండటం విశేషం…