SI Harassment Case:”నీ అందం నన్ను కవ్విస్తోంది. నీ వయసు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏం చేస్తే నువ్వు నా సొంత మవ్వుతావు.. రోజు నీతో వీడియో కాల్ మాట్లాడుతున్న కదా.. నువ్వు కూడా నాతో నగ్నంగా మాట్లాడొచ్చు కదా.. నేను చూస్తుండగా నువ్వు బట్టలు విప్పేయచ్చు కదా.. ప్లీజ్ నన్ను సుఖపెట” ఇదీ ఓ కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో ఓ ఎస్సై మాట్లాడిన మాటలు.
అతడి పేరు రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా ముదిగిబ్బ మండలంలోని పట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ కేసులో భరణం ఇప్పించాలని ఆమె తరపున గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఆ గిరిజన మహిళ చూసేందుకు అందంగా ఉండడంతో.. దీనిని అదునుగా తీసుకున్న రాజశేఖర్ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని.. అప్పుడే న్యాయం చేస్తానని .. ఆలా చేయకపోతే తన నుంచి ఇబ్బందులు తప్పవని ఆమెను వేధింపులకు గురిచేసాడు. ఆమె నంబరు తీసుకుని రాత్రిపూట పదేపదే కాల్స్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. అతడు నగ్నంగా మారి.. ఆమెను కూడా అలానే మారిపోవాలని ఒత్తిడికి గురి చేసేవాడు. తన భార్యను వదిలిపెట్టాలని ఆ గిరిజన మహిళ భర్త వేడుకున్నప్పటికీ ఎస్సై వినిపించుకునేవాడు కాదు. ఓసారి ఆమె అనంతపురం వెళ్ళింది. ఆమెను ఎస్ఐ వెంబడించాడు. తన వాహనంలో ఎక్కాలని ఒత్తిడికి గురిచేసాడు.
Also Read: స్త్రీ శక్తి పథకం.. ఏయే బస్సుల్లో..ఏయే కార్డులు చూపించాలంటే?
రాజశేఖర్ వేధింపులు అంతకంతకు పెరిగిపోవడంతో ఆ మహిళ తనకు వీడియో కాల్ చేసినప్పుడు.. దానిని రికార్డ్ చేసింది. ఆ వీడియోలో ఎస్ఐ రాజశేఖర్ టవల్ తో ఉన్నాడు. ఆ మహిళతో అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు. అంతేకాదు తన ప్రైవేట్ పార్ట్స్ బయటికి తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో బయటికి రావడంతో ఎస్ఐ బాగోతం బయటకు వచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వచ్చింది. దీంతో అతని వేకెన్సీ రిజర్వ్ కు బదిలీ చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. అతని వ్యవహారంపై విచారణ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.