Rowdy Boys Trailer: ‘దిల్’ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నామని చిత్రబృందం అధికారికంగా తెలిపింది.

పైగా తాజాగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ‘రౌడీ బాయ్స్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుండటం విశేషం. ఎన్టీఆర్ హ్యాండ్ మంచిది అని ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. అందుకే, దిల్ రాజు తన తమ్ముడు కొడుకు కోసం తారక్ ను పట్టుకొచ్చాడు. దిల్ రాజు సహజంగా వేరే హీరోల కథలపైనే సంవత్సరాలు పాటు వర్క్ చేయించి సినిమాలు తీస్తాడు.
Also Read: ఆ రోజులను తలుచుకొని కన్నీరుపెట్టిన జీవితా రాజశేఖర్
మరి తన తమ్ముడు కుమారుడి కోసం ఇక దిల్ రాజు ఎంతగా కసరత్తులు చేసి ఉంటాడు ? అందుకే, ఏకంగా మూడు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేయించి ఈ సినిమాని తీశాడట. అయినా దిల్ రాజుకి ఎక్కడో భయం ఉందనుకుంటా. ప్రమోషన్స్ లో సినిమా పై ఓవర్ గా ఎక్కడా మాట్లాడటం లేదు. ఆ మధ్య పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ‘దిల్’ రాజు సినిమా గురించి డౌట్ గా మాట్లాడాడు.
అందుకే ఎక్కడో ఈ సినిమా పై అపనమ్మకం క్రియేట్ అయింది ప్రేక్షకుల్లో కూడా. ఏది ఏమైనా సినిమా ఎలా ఉన్నా అద్భుతమైన సక్సెస్ ఫుల్ సినిమా అంటూ ఫుల్ స్పీచ్ లు ఇవ్వడానికి కొంతమంది దర్శకులను, మరి కొంతమంది హీరోలను ఇప్పటికే దిల్ రాజు రెడీ చేసి పెట్టాడు. ఆడియో ఫంక్షన్ లో ఫుల్ లాంగ్ స్పీచ్ లు ఉండబోతున్నాయి. సిద్ధం కాండీ. ఇంతకీ ఈ ‘‘రౌడీ బాయ్స్’ హిట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read: ఛార్మీ క్లారిటీతో విజయ్ దేవరకొండ ఫుల్ చిల్ !