Karate Kalyani: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదం… కరాటే కళ్యాణి మా సభ్యత్వం రద్దు!

కరాటే కళ్యాణి మా సభ్యత్వం రద్దు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడు అయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి కరాటే కళ్యాణ్ జాయింట్ సెక్రెటరీగా పోటీ చేసింది. తన ప్యానెల్ మెంబర్ నే మంచు విష్ణు శిక్షించినట్లు అయ్యింది.

Written By: Shiva, Updated On : May 26, 2023 10:46 am

Karate Kalyani

Follow us on

Karate Kalyani: నటి కరాటే కళ్యాణికి బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ఆమె మా సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుపై కరాటే కళ్యాణి వ్యతిరేకత వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తో సంప్రదించకుండా ఈ విషయంపై స్పందించిన కరాటే కళ్యాణి వివరణ ఇవ్వాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు జారీ చేశారు. మే 16న కరాటే కళ్యాణి వివరణ ఇచ్చారు. కరాటే కళ్యాణి వివరణపై సంతృప్తి చెందని మా కార్యవర్గం చర్యలు తీసుకుంది. మొత్తంగా ఆమె మా సభ్యత్వం రద్దు చేసింది.

కరాటే కళ్యాణి మా సభ్యత్వం రద్దు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడు అయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి కరాటే కళ్యాణ్ జాయింట్ సెక్రెటరీగా పోటీ చేసింది. తన ప్యానెల్ మెంబర్ నే మంచు విష్ణు శిక్షించినట్లు అయ్యింది.

మే 28న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో గల లకారం ట్యాంకు బండ్ పై ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు అవతారంలో తయారు చేయించారు. ఎన్టీఆర్ కెరీర్లో పలుమార్లు కృష్ణుడు రోల్ చేశారు. ఆ ఉద్దేశంతో కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.

దీన్ని యాదవ సంఘాలు తప్పుబట్టాయి. దేవుడు రూపంలో మనుషుల విగ్రహాలు ఏర్పాటు చేయడం తగదని వారు ఉద్యమం లేపారు. ఈ ఉద్యమంలో కరాటే కళ్యాణి కీలక పాత్ర పోషించింది. యాదవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షురాలిగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ దేవుడు పాత్రలు చేసినంత మాత్రాన దేవుడు అవుతాడా? అని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.