NTR and Prashanth Neel : మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో షూటింగ్ దశ నుండే విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి #NTRNEEL. కేజీఎఫ్, సలార్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఎన్టీఆర్(Junior NTR) తో చేస్తున్న చిత్రమిది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటి నుండి మొదలు అవ్వబోయే ఫ్రెష్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నాడు. సుమారుగా మూడు వారాల పాటు ఎన్టీఆర్ పై ఒక భారీ యాక్షన్ సంనివేశాన్ని చిత్రీకరించబోతున్నారు మేకర్స్. ఇది సినిమాకే పెద్ద హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలు లాగా కాకుండా ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Raed : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా చిక్కిపోయాడు. అప్పుడెప్పుడో కంత్రి, యమదొంగ సమయంలో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో, ఇప్పుడు అలా తయారయ్యాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల కటౌట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్, యాష్ వంటి వారికి ఫ్రేమ్ పెడితే ఫ్యాన్స్ తో పాటు, మూవీ లవర్స్ కూడా మెంటలెక్కిపోయే రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని తన కెమెరాలతో చూపించాడు ప్రశాంత్ నీల్. కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఎందుకు ఇంత సన్నగా చూపిస్తున్నాడు. హీరో స్క్రీన్ ప్రెజన్స్ తోనే సగం సినిమాని నడిపించే ప్రశాంత్ నీల్, మొదటి నుండి ఈ అంశం విషయం లో సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ ని ఎదురుకుంటున్న ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. హల్క్ లాగా చూపిస్తాడు అనుకుంటే, ఎన్టీఆర్ ని బక్కగా చూపిస్తూ ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ ని అందించాడు.
రేపటి నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్న సందర్భంగా, నేడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య రేపు చేయబోయే సన్నివేశాల గురించి చర్చ జరిగింది. సముద్రం ఒడ్డున ఎన్టీఆర్ స్టైల్ గా గొడుగు చేతిలో పెట్టుకొని ప్రశాంత్ నీల్ తో మాట్లాడున్న ఫోటోని మూవీ టీం రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వాసంత్ నటించబోతుంది. అదే విధంగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందిన ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కమల్ హాసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. అదే కనుక జరిగితే ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. వచ్చే ఏడాది సమ్మర్ లోపు ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!