
‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోకి ఎన్టీఆర్ హోస్ట్ అనగానే ఇక బుల్లితెర మళ్ళీ షేక్ అవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ, విచిత్రంగా ఎన్టీఆర్ చేస్తోన్న ఈ షోకు అసలు హైప్ రావట్లేదు. హైప్ అంటే రావాల్సినంత స్థాయిలో రావడం లేదు. నిజానికి ఈ ‘షో’కు మెగాస్టార్ హోస్ట్ గా చేసినప్పుడు కూడా హైప్ రాలేదు. అందుకే, ఈ షో యాజమాన్యం ఈ సారి ఎన్టీఆర్ ను నమ్ముకుంది.
అయినా హైప్ ఎందుకు రావడం లేదు అని ఆలోచనలో పడ్డారు మేకర్స్. అయితే, ఈ షోకు హైప్ రాకపోవడానికి ముఖ్య కారణం సరైన ప్రొమోషన్ లేకపోవడమే. దీనికితోడు ఈ షో నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలు కూడా మరీ కామెడీగా ఉన్నాయి. ఓ దశలో ఆ ప్రోమోలు బాగా ట్రోలింగ్ కి కూడా గురయ్యాయి. అందుకే, ఈ షో టీమ్ ఇప్పుడు హైప్ క్రియేట్ చేయడం కోసం కొత్తగా కసరత్తులు మొదలు పెట్టింది.
అందులో భాగంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఒక ప్రోమోను కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనేక బాధలతో పలు సమస్యలతో నలిగిపోతున్న జనం ‘అయ్యా మాకు నువ్వే దిక్కు, మాకు మంచి జరగాలంటే నువ్వు బరిలోకి దిగాలి’ అని కొంతమంది జనం అంతా వేడుకుంటూ కనిపిస్తే.. అప్పుడు ఎన్టీఆర్ రివీల్ అవుతాడట. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాలకు ముడి పెడుతూ ఒక ప్రోమో కట్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇప్పటికే ఈ ప్రోమోకి సంబంధించి షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రోమో కాస్త వివాదాస్పదం అయినా ఈ షోకు కావాల్సినంత హైప్ వస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి జనం అటెన్షన్ కూడా దొరుకుతుంది. అందుకే ఇలాంటి ప్రోమోకి ఎన్టీఆర్ ఒప్పుకోకపోయినా.. రిక్వెస్ట్ చేసి డైరెక్ట్ గా రాజకీయాలు తీసుకురాం అని హామీ ఇచ్చి.. ఈ ప్రోమోను కట్ చేస్తున్నారు.
ఎలాగూ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై అనేక రూమర్స్ వస్తున్నాయి కాబట్టి, ఈ ప్రోమో బాగానే వర్కౌట్ అవ్వొచ్చు. అయితే, ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తన సినీ కెరీర్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టారు. ఇప్పట్లో రాజకీయాల ఏ విధంగా ఆలోచించే ఆలోచనలో లేడు.