https://oktelugu.com/

బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్, మహేష్, చరణ్..!

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాలలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే అఖిల్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన ఆరుగురు సభ్యులలో నలుగురు టాప్ ఫైవ్ కి వెళ్లనున్నారు. ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. అయితే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరిని దించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయట. విన్నర్ ఎవరో తేలిపోయే ఫైనల్ ఎపిసోడ్ ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ఓ స్టార్ ని […]

Written By:
  • admin
  • , Updated On : December 5, 2020 / 12:26 PM IST
    Follow us on


    బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాలలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే అఖిల్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన ఆరుగురు సభ్యులలో నలుగురు టాప్ ఫైవ్ కి వెళ్లనున్నారు. ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. అయితే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరిని దించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయట. విన్నర్ ఎవరో తేలిపోయే ఫైనల్ ఎపిసోడ్ ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ఓ స్టార్ ని గెస్ట్ గా పిలవాలనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తుంది.

    Also Read: థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం రాబోతుందా?

    బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చారు. ఇక నాని హోస్ట్ గా నడిచిన సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రావడం జరిగింది. కాగా ఈ సీజన్ కోసం క్రేజీ టాప్ స్టార్స్ పేర్లు పరిశీలిస్తున్నారట నిర్వాకులు. వీరిలో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తేవాలని అనుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయనను గెస్ట్ గా తీసుకువస్తే భారీ ఆదరణ దక్కడం ఖాయం అని భావిస్తున్నారట. అలాగే ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ పేర్లు కూడా ఉన్నాయట. వీరెవ్వరు రాని పక్షంలో దర్శకధీరుడు రాజమౌళిని అతిథిగా తేవాలనుకుంటున్నారట.

    Also Read: వివాదాల వర్మ సైలెంట్‌గా ఉంది అందుకే !

    మొత్తంగా బాగా క్రేజ్ ఉన్న ఓ టాప్ స్టార్ ని అతిధిగా తేవాలని గట్టి ప్రయత్నాలలో ఉన్నారట. పైన చెప్పిన లిస్ట్ లో ఏ ఒక్కరు ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చినా, భారీ ఆదరణ దక్కడం ఖాయం. ప్రస్తుతం హౌస్ లో అఖిల్, అవినాష్, అరియనా, హారిక, మోనాల్, సోహెల్ మరియు అభిజిత్ ఉన్నారు. ఈ వారానికి గాను అవినాష్, మోనాల్, అభిజిత్, అఖిల్ మరియు హారిక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ కానున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags