Homeఎంటర్టైన్మెంట్'ఎన్టీఆర్ - కొరటాల' సినిమా పై క్రేజీ అప్ డేట్ !

‘ఎన్టీఆర్ – కొరటాల’ సినిమా పై క్రేజీ అప్ డేట్ !

కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మరి ఈ టాక్ లో నిజం ఎంత ఉందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే, ఈ సినిమాలో విలన్ కి రైట్ హ్యాండ్ లా కమెడియన్ సునీల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. కాకపోతే […]

NTR Koratala Sivaకొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మరి ఈ టాక్ లో నిజం ఎంత ఉందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే, ఈ సినిమాలో విలన్ కి రైట్ హ్యాండ్ లా కమెడియన్ సునీల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.

కాకపోతే సునీల్ పాత్ర వెరీ వైలెంట్ గా ఉంటుందట. నిజంగా సునీల్ మంచి కమెడియన్. తెలుగు తెర పై నవ్వులు పూయించిన గ్రేట్ కమెడియన్స్ లో అతను కూడా ఒకడు. కానీ గత కొన్ని సినిమాలుగా విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పాపం మధ్యలో కొంతకాలం హీరోగా సెటిల్ అవ్వడానికి నానా పాట్లు పడ్డాడు అనుకోండి.

ఎన్నో పాట్లు పడినా మనోడికి చివరకు కమెడియన్ గా కూడా ఛాన్స్ లు లేకుండా పోయాయి. దాంతో విలన్ రోల్స్ పై మక్కువ పెంచుకున్నాడు. విలన్ పాత్రల కోసం ప్రస్తుతం తాపత్రయం పడుతూ తన సన్నిహితులతో దయచేసి నా కోసం ఒక పాత్ర రాయండి అంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయితే, సునీల్ రిక్వెస్ట్ ను కొరటాల అంగీకరించినట్లు తెలుస్తోంది.

చాలామందికి తెలియదు, సునీల్ కి కొరటాల కి మధ్య మంచి స్నేహం ఉంది. కొరటాల మొదటి సినిమా భద్ర నుండే వీరి మధ్య సాన్నిహిత్యం బిల్డ్ అవుతూ వచ్చింది. అందుకే ఎప్పటి నుండో సునీల్ కి మంచి పాత్ర ఇవ్వాలని కొరటాల అనుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ అది కుదిరింది అన్నమాట. మరి సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా ? ‘కలర్ ఫోటో’ సినిమాతో తనలోని విలన్ కోణాన్ని చూపించినా అది సక్సెస్ కాలేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper