Kamal Haasan-NTR: ఒక మహా నటుడు మరో మహా నటుడితో నటనలో పోటీ పడితే ఎలా ఉంటుంది ?, ఎప్పుడో ఆ రోజుల్లో ఎన్టీఆర్ – ఎస్వీఆర్ మధ్య ఈ పోటీని చూశాం. మళ్లీ తెలుగు ప్రేక్షకులకు ఆ అదృష్టం కలగలేదు. కానీ, నేటి తరం ప్రేక్షకులకు ఆ మహర్దస కలగబోతుంది. నిన్నటి తరం మహా నటుడు కమల్ హాసన్ తో, నేటి తరం మహానటుడు ఎన్టీఆర్ నటనలో పోటీ పడబోతున్నాడు. అబ్బా.. వినడానికే ఎంత బాగుంది ఇది !. ఇంతకీ ఇంత అద్భుతమైన ఐడియా ఎవరికీ వచ్చింది ? కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ క్రేజీ ప్లాన్ ఇది.

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. ఈ పాత్ర.. కథనే మలుపు తిప్పుతుంది. అందుకే, ఈ పాత్రలో కమల్ హాసన్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ వార్త వాస్తవ రూపం దాల్చితే.. భారతీయ సినీ తెరకు మరో పండుగ ఖరారు అయినట్టే. మరి ఆ పండుగ త్వరగా రావాలని కోరుకుందాం.
కమల్ హాసన్ కూడా ఈ సినిమా ఒప్పుకుంటాడని ప్రశాంత్ నీల్ నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం జరుగుతుందని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుందట. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పైనే కమల్ హాసన్ తన “విశ్వరూపం” సినిమా తీశాడు.
ఈ నేపథ్యం పై కమల్ కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కొన్ని ఊహించిన పరిణామాలు జరిగాయని కొందరి వాదన. కమల్ కి తన సినిమాలో వాటిని పూర్తిగా చూపించే అవకాశం కలగలేదు. ముఖ్యంగా అల్ ఖైదా, డర్టీ బాంబు లాంటి క్లిష్టమైన, కష్టమైన అంశాలను ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ప్రభావితం చేసి వాటిని లేకుండా చేశాడనేది మెయిన్ కథ.

ఆ ఆఫీసర్ మెంటర్ పాత్రలోనే కమల్ నటించే అవకాశం ఉంది. కథ చాలా మలుపులు తిరుగుతుందట. కమల్ – ఎన్టీఆర్ మధ్యే భీకరమైన పోరు జరుగుతుందని.. దేశం కోసం కమల్ పాత్ర ప్రాణ త్యాగం చేస్తోందని కూడా తెలుస్తోంది. కథ చాలా బరువైనది. ఇలాంటి బరువైన కథలో బలమైన నటులు నటిస్తే.. ఆ అపూర్వమైన నటనా సామర్ధ్యాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఆ చూసే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం.
Also Read:Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవితకాలపు మానసిక సంఘర్షణ ఉంది
Recommended Videos