Homeఎంటర్టైన్మెంట్తెలుగువాళ్ళ స్థితని, గతిని మార్చిన శక్తి 'ఎన్టీఆర్' !

తెలుగువాళ్ళ స్థితని, గతిని మార్చిన శక్తి ‘ఎన్టీఆర్’ !

NTR Jayanthi

తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాలకి ఒక విన్నపం చేయడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా స్థితని , తెలుగు రాజకీయాల గతిని మార్చిన ఒక శక్తి, అంత గొప్ప మహానుభావుడికి భారత రత్న రాకపోవడం నిజంగా భారతరత్నకే అది అవమానం. అందుకే మెగాస్టార్ లాంటి హీరోలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగానైనా ఆయనకు భారతరత్న వచ్చేలా చూడాలని మెగాస్టార్ కోరారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. ‘మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం’ అని మెగాస్టార్ కోరారు. చిరంజీవి. ‘తిరుగులేని మనిషి’ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మెగాస్టార్ ఇలా మహనీయుల బర్త్ డేలకు తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలపడం గొప్ప విషయం.
YouTube video player

అయితే, ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అనే చిరు కోరిక ఎప్పటికైనా తిరుగుతుందా ? నేటి రాజకీయ అవసరాలను బట్టి బిరుదులు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ భారత రత్న ఇస్తారా ? అయినా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.

తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఎన్టీఆర్ ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ లోకాన్ని విడిచి పదుల సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆయనను తెలుగు ప్రజలు తమ హృదయాల్లో ఇప్పటికీ శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. కాగా నేడు ఆయన జయంతి కావడంతో యావత్తు అభిమాన లోకంతో పాటు సినీ లోకం కూడా ఆయనను స్మరించుకుంటున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version