https://oktelugu.com/

NTR Jayanthi: తెలుగులో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరో ఎవరో తెలుసా?

NTR Jayanthi: తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర ఎన్టీఆర్. ఆయన సినీ ప్రస్థానం.. అనంతరం రాజకీయ పయనం తెలుగునేలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎన్టీఆర్ కు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఉండేలా చేసింది. అంతటి మహానుభావుడు ఎప్పుడూ డబ్బుల కోసం అర్రులు చాచేవాడు కాదని.. నిర్మాతల హీరో అని తెలిసింది. ఎన్టీఆర్ ‘మనదేశం’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు గాను ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం కేవలం రూ.200 మాత్రమే. 50వ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2022 / 11:21 AM IST
    Follow us on

    NTR Jayanthi: తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర ఎన్టీఆర్. ఆయన సినీ ప్రస్థానం.. అనంతరం రాజకీయ పయనం తెలుగునేలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎన్టీఆర్ కు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఉండేలా చేసింది. అంతటి మహానుభావుడు ఎప్పుడూ డబ్బుల కోసం అర్రులు చాచేవాడు కాదని.. నిర్మాతల హీరో అని తెలిసింది.

    ఎన్టీఆర్ ‘మనదేశం’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు గాను ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం కేవలం రూ.200 మాత్రమే. 50వ దశకంలో అదే లక్షలతో సమానం. టాలీవుడ్ తొలినాళ్లలో ఎవరికీ పారితోషికం ఇచ్చేవారు కాదట.. అంతా కంపెనీ ఆర్టిస్టులుగా పరిగణించి నెల జీతం ఇచ్చేవారు.

    ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగినా కూడా తన పారితోషికం పెంచకుండా నిర్మాతల హీరోగానే అందుబాటులో ఉండేవారు. ఎన్టీఆర్ తక్కువ తీసుకోవడంతో టాలీవుడ్ మిగతా హీరోలు డిమాండ్ చేసే వారు కాదు. అగ్రహీరో ఎన్టీఆర్ అంత తక్కువ తీసుకుంటే మీకేంటి అని నిర్మాతలు మిగతా హీరోలకు పెద్దగా రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు..

    కోటి రూపాయలు పారితోషికం తీసుకోవడానికి ఎన్టీఆర్ కు 40 ఏళ్లు పట్టిందంటే అతిశయోక్తి కాదు.. అదీ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే మోహన్ బాబు ప్రేమగా ఇచ్చిందే. అవును 1993లో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీనికి మోహన్ బాబునే నిర్మాత. ఈ సినిమాలో కీలక పాత్రను అప్పటి మాజీ సీఎంగా ఉండి సినిమాలు వదిలేసిన ఎన్టీఆర్ చేశాడు. దీంతో సినిమాకు బాగా కలిసి వచ్చి కలెక్షన్లు బాగా వచ్చాయి. దీంతో మోహన్ బాబు ఏకంగా ‘కోటి రూపాయల’ పారితోషికాన్ని ఎన్టీఆర్ ఇచ్చాడు. అదో రికార్డ్..

    తెలుగు చిత్ర సీమలో 40 ఏళ్లుగా ఉన్న ఏ హీరో కూడా కోటి రూపాయలు తీసుకున్నది లేదు. కానీ ఎన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాతో తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత చాలా రోజులకు మెగా స్టార్ చిరంజీవి ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం హీరోలు 50-100 కోట్ల వరకూ తీసుకుంటూ రెమ్యూనరేషన్ పెంచేశారు. కానీ నాడు కోటి రూపాయలు అంటే ఎంతో గొప్ప.

    Tags