https://oktelugu.com/

Jabardast: జబర్ధస్త్ షాకింగ్ నిర్ణయం.. ఇలా చేయడానికి కారణమేంటి?

Jabardast: బుల్లితెరలో కామెడీ షోగా గుర్తింపు పొందింది జబర్దస్త్. ఆరంభంలో మంచి రెస్పాన్స్ రావడంతో షోకు ఎదురు లేకుండా పోయింది. కానీ రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు జబర్దస్త్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో కార్యక్రమ నిడివి తగ్గించినట్లు సమాచారం. గతంలో దాదాపు గంటన్నర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తనదైన శైలిలో దూసుకుపోయిన షో ప్రస్తుతం అరగంటకు దిగిపోవడం తెలిసిందే. 2013లో ప్రారంభమైనప్పుడు జబర్దస్త్ షో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంఖ్య లక్షల్లో ఉండేది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 28, 2022 / 11:14 AM IST
    Follow us on

    Jabardast: బుల్లితెరలో కామెడీ షోగా గుర్తింపు పొందింది జబర్దస్త్. ఆరంభంలో మంచి రెస్పాన్స్ రావడంతో షోకు ఎదురు లేకుండా పోయింది. కానీ రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు జబర్దస్త్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో కార్యక్రమ నిడివి తగ్గించినట్లు సమాచారం. గతంలో దాదాపు గంటన్నర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తనదైన శైలిలో దూసుకుపోయిన షో ప్రస్తుతం అరగంటకు దిగిపోవడం తెలిసిందే. 2013లో ప్రారంభమైనప్పుడు జబర్దస్త్ షో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంఖ్య లక్షల్లో ఉండేది. కానీ ఇప్పుడు దాని ప్రభావం తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కువ మంది శ్రద్ధ చూపించడం లేదని చెబుతున్నారు.

    Jabardast

    జబర్దస్త్ షో లో కామెడీ తగ్గింది. కమెడియన్లు కూడా సీనియర్లు అందరు వెళ్లిపోయారు. ఎందుకో గానీ జబర్దస్త్ టీంలు చప్పగా ఉంటున్నాయి. కామెడి పండించడంలో మునుపటి సత్తా లేదు. వాగ్దాటి కనిపించడం లేదు. పంచులైతే పేలడం లేదు. ఫలితంగా షో విమర్శలు మూటగట్టుకుంటోంది. మల్లెమాల ప్రొడక్షన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించిన కార్యక్రమం కాస్త డోలాయమానంలో పడుతోంది. నిత్యం కొత్త వారి రాకతో అసలు రంజింప చేయడం లేదు. దీంతో ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

    Also Read: KCR- Regional parties: ప్రాంతీయ పార్టీలతో రాజకీయసంద్రంలోకి కేసీఆర్‌.. మునుగుతారా.. తేలుతారా

    ఎందుకీ అవస్థ అంటే కళాకారుల్లో నిలకడ లేకపోవడమే. జడ్జిలు కూడా మాటిమాటికి మారడం. గతంలో నాగబాబు, రోజా ఉన్నప్పుడు కార్యక్రమం ఉర్రూతలూగింది. ప్రతి స్కిట్ ఓ ఆణిమతుత్యంలా అనిపించేది. కామెడీ కూడా పండేది. పంచులైతే లెక్కలేకుండా పోయేవి. కానీ ఇటీవల కాలంలో ఆ పాత పద్ధతి కనిపించడం లేదు. కమెడియన్లలో పరస్పర సహకారం కొరవడుతోంది. ఫలితంగా వారు ఏం చేసిన అభిమానుల్లో నవ్వులు మాత్రం పూయించడం లేదు.

    దీనిపై మల్లెమాల కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షోను జనరంజకంగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకోవాల్సిన మార్పులపై దృష్టి సారించింది. అభిమానుల దృష్టి మళ్లీ ఈ షోపై నిలిపేందుకు ఏం చేయాలని ఆలోచిస్తోంది. కమెడియన్లకు సరైన రీతిలో పారితోషికాలు అందిస్తున్నా వారు వేరే షోలకు వెళ్లడం సందేహాత్మకంగా కనిపిస్తోంది. ఇదే కామెడీని వారు ఇతర చానళ్లలో కూడా పండిస్తున్నట్లు సమాచారం. దీంతోనే జబర్దస్త్ కార్యక్రమం కాస్త వెనుక పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి మల్లెమాల మరోమారు జబర్దస్త్ కు జవసత్వాలు నింపే పనిలో పడిందని కళాకారుల విశ్లేషణ.

    Also Read: Koratala Siva Ignoring NTR: ఎన్టీఆర్ మాటలను పట్టించుకోని కొరటాల శివ.. మళ్ళీ అదే తప్పు చెయ్యబోతున్నాడా?

    Recommended Videos:

    Tags