Clean Chit To Aryan Khan: నిండ మునిగాక చలెక్కడిది అంటారు. డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఇరుక్కుని జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చి ఇప్పుడు క్లీన్ చిట్ తెచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. అవినీతికి కొమ్ముకాసే వారున్న మన దేశంలో ఎంతటి శిక్ష నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చు అనడానికి ఇదే నిదర్శనం. గత అక్టోబర్ రెండున ముంబయిలోని సముద్రంలోని ఓ క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ డ్రగ్స్ వాడిన 14 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎన్ సీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించారు. ఇందులో పెద్ద పెద్దవారి పిల్లలు ఉండటంతో కేసు బలంగా ముందుకెళ్లలేదని తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇందులో ఉండటం అప్పట్లో సంచలనం కలిగిందింది. కానీ ఏం లాభం మళ్లీ క్లీన్ చిట్ పేరుతో బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కేసు విచారణలో నిర్లక్ష్యం ఉందా? లేక ముడుపులు ముట్టాయా? అనేది అనుమానాలకు తావిస్తోంది. 14 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపితే వారు డ్రగ్స్ తీసుకోలేదని ఎలా నిర్ధారిస్తారు? వారికి ఎవరితోనైనా భయం పుట్టించారా? లేక డబ్బులు లంచంగా ఇచ్చారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. మన దేశంలో చట్టాలు ఉన్న వాడికి చుట్టాలే కావడం గమనార్హం. ఎంత పెద్ద నేరమైనా తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే షారుఖ్ ఖాన్ తనయుడు బయటపడినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఎన్సీబీ అధికారులు ఇందులో విలన్లుగా మారడం విచిత్రమేమీ కాదు.
Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి ఉన్న రిలేషన్ తెలుసా?
అక్టోబర్ 7న ఆర్యన్ ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అక్టోబర్ 30న బెయిల్ మంజూరు అయింది. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు చూపించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఎన్సీబీ అధికారులు దాడి చేసే సమయంలో వీడియోలు తీస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పని చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇందులో ఏదో మతలబు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అమ్యామ్యాలకు ఆశపడి కొందరు అధికారులు కేసును నిర్వీర్యం చేశారనే వాదనలు కూడా వస్తున్నాయి.
డబ్బుంటే చాలు ఎంతటి కేసులో అయినా ఏం ప్రమాదం ఉండదని ఈ కేసు విషయంలో అభిప్రాయాలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆర్యన్ ఖాన్ పై ఆధారాలు చూపలేకపోయారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఓ సెలబ్రిటీకి మంచి ప్రచారం కల్పించి వారి ఖ్యాతిని పెంచినట్లు తెలుస్తోంది. దేశంలో చట్టాలు ఇలా ఉన్నంత కాలం ఎవరు ఎన్ని నేరాలు చేసినా ఏం ఫర్వాలేదనే ధోరణి రాక మానదు. ఆర్యన్ ఖాన్ అరెస్టు చేసి ఏదో ఘనకార్యంగా భావించినా చివరకు మాత్రం చీత్కారాలే ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసుల్లో క్లీన్ చిట్ రావడం అంటే మన అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమైపోతోంది.
Also Read: Venkatesh Fun with Bithiri Sathi : బిత్తిరి సత్తికి లైవ్ లోనే షాకిచ్చిన వెంకటేశ్