NTR: స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్న ఎన్టీయార్…ఇక ఫ్యాన్స్ కి పూనకాలే…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది నటులు ఉన్నప్పటికి ఇక్కడ కొందరికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది...కారణం ఏంటంటే వాళ్ళు తమ నటనతో ప్రేక్షకులందరిని కట్టి పడేస్తారు...అందులో జూనియర్ ఎన్టీయార్ ఒకరు...

Written By: Gopi, Updated On : August 12, 2024 1:35 pm

NTR:

Follow us on

NTR: ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతో తడబడ్డాడు…అయినప్పటికీ రెండోవ సినిమాగా వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ఒక్కసారిగా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను దిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ‘దేవర ‘ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు అయిన కొరటాల శివ ఈ సినిమాని మాస్ మసాలా సినిమాగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన తర్వాత ప్రాజెక్టుల మీద కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూడు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకుంటే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా చాలా మంచి గుర్తింపైతే సంపాదించుకుంటాడు.

మరి ఎన్టీఆర్ చేస్తున్న ఈ వరుస సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఒక స్టార్ క్రికెటర్ బయోపిక్ లో కూడా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2027 వ సంవత్సరం నుంచి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.

ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనుకుంటున్నారా రీసెంట్ గా ఇండియన్ టీమ్ కు టి20 వరల్డ్ కప్ ని అందించిన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ…ఈయనకి ఇండియన్ టీమ్ తరుపున చాలా మంచి రికార్డు అయితే ఉంది. ఇక ఐపీఎల్ లో కూడా ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ టీమ్ కి ఐదు సార్లు కప్పు అందించిన కెప్టెన్ గా కూడా ఆయన ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇక రోహిత్ శర్మ బయోపిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.

కాబట్టి ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ ఈ బయోపిక్ లో నటించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…