NTR- Ram Charan: తెలుగు సినిమా పరిశ్రమలో ప్యాన్ ఇండియా స్టార్ లు పెరిగిపోతున్నారు. ప్రభాస్ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నేటికి కొనసాగుతోంది. దీంతో పుష్పతో అల్లు అర్జున్, త్రిబుల్ ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్యాన్ ఇండియా స్టార్ లుగా ఎదిగారు. ఇప్పడు వారు తదుపరి తీయబోయే సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే ఉండాలని చూస్తున్నారు. ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రెండేళ్లు ఏ సినిమా ఒప్పుకోలేదు. ఏ సినిమా చేయలేదు. దీంతో రెండేళ్లు విరామం అనంతరం ట్రిపుల్ ఆర్ వచ్చింది. భారీ విజయాన్ని నమోదు చేసింది. కానీ ఎన్టీఆర్ ఇన్ని రోజులు ఎప్పుడు కూడా సినిమాలు చేయకుండా ఉండలేదు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో వేగం పెంచారు. కొత్త సినిమాలు చేసేందుకు వరుసగా ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో రాంచరణ్ ను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా విజయవంతమైన సందర్భంలో చారిత్రక నేపథ్యమున్న సినిమాలకు భలే క్రేజీ ఉందని తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీంతోనే తరువాత వచ్చే సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’: ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
జూనియర్ ఎన్డీఆర్ తరువాత ప్రాజెక్టు కొరటాల శివతోనే అని తీయనున్నారు. మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తారని ప్రచారం సాగినా ఆయన మహేశ్ బాబుతో తీస్తున్నందున ఎన్టీఆర్ తో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే కొరటాల శివతో తన ప్రాజెక్టు ఉంటుందని తెలుస్తోంది. తరువాత తమిళ దర్శకుడు శంకర్ తో ఓ మూవీ చేయడానికి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. శంకర్ రాంచరణ్ తో కూడా ఓ సినిమా తీస్తున్నారు దానికి సిటిజన్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ మధ్య శంకర్ తమిళులను వదిలి తెలుగువారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రశాంత్ ఇంద్రనీల్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇండియా, పాకిస్తాన్ విడిపోయిన నేపథ్యంలో జరిగిన పోరాటం ఇతివృత్తంగా తీయబోతున్నట్లు సమాచారం. దీంతో చారిత్రక నేపథ్యమున్న సినిమాల వైపు దృష్టి సారిస్టున్నట్లు చెబుతున్నారు. రాబోయే సినిమాలు అన్ని కూడా ఇదే కోవలోనే ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గతంలో రాంచరణ్ నడిచిన బాటలోనే ఎన్టీఆర్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.