Kishan Reddy- KCR: కేంద్రం వర్సెస్ తెలంగాణగా రాజకీయాలు నడుస్తున్నాయి. నీతి ఆయోగ్ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నీతిఆయోగ్ ను టార్గెట్ చేసుకుని సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. నిరాధార ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించినంత పని చేసింది. దీంతో పరస్పర మాటల దాడి పెరుగుతోంది. కేంద్రంపై అనవసర మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు నీతి ఆయోగ్ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

కేంద్రం నిధులు ఇస్తుంటే వాడుకోకుండా ఎందుకు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని ప్రశ్నిస్తోంది. రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో బీజేపీ బలపడనంత వరకు ఏం మాట్లాడని కేసీఆర్ బీజేపీ బలం పెరుగుతుంటే ఓర్వలేకే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
Also Read: MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..
దీనిపై నీతి ఆయోగ్ అధికారులు కూడా లెక్కలతో సహా అన్ని వివరాలు బయటపెడుతున్నారు. దీంతో కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా కేసీఆర్ పరిస్థితి మారుతోంది. అనవసర విషయాల్లో తలదూర్చి లెక్కలతో సహా దొరికిపోతున్నారు. దీనిపై ప్రజల్లో చులకన అవడం తప్ప ఒరిగేమీ లేదని తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బాగోతాలను బయట పెడతామని చెబుతున్నారు. నీతి ఆయోగ్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సైతం విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

నీతి ఆయోగ్ తో మొదలైన మాటల యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందో తెలియడం లేదు. టీఆర్ఎస్ మంత్రులు కూడా కలుగజేసుకోవడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఘాటుగానే వారికి కౌంటర్ ఇస్తున్నారు. కేంద్రంపై కోపంతో ఇలా మాట్లాడటంలో అర్థం లేదని కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాలు విసురుతున్నారు. నీతి ఆయోగ్ కోట్లు ఇస్తుంటే మాకు ఇవ్వడం లేదని మొండికేయడం బాధాకరమని చెబుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు కూడా తాము రెడీయేనని సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లొల్లి ఎక్కడిదాకా వెళ్తుందోననే అనుమానాలు అందరిలో ఉన్నాయి.
Also Read:ITDP: త్వరలో మరో ఎంపీ వీడియో… ఐటీడీపీ అంత పనిచేస్తోందా?