Nandamuri Taraka Rama Rao: తెలుగు సినీ చరిత్రలో మహానటుడు.. విశ్వవిఖ్యాత.. నట సౌర్వభౌమ.. నందమూరి తారక రామారావు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ అసమాన నట ప్రతిభ అందరికీ తెలిసిందే.. పౌరాణిక చిత్రాల్లో అంతలా ఒదిగిపోతారు ఎన్టీరామారావు. కృష్ణుడిగా, రాముడిగా, రావణుడిగా, వేంకటేశ్వర స్వామిగా ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తారు. ఎన్టీఆర్ రాముడి వేషం, కృష్ణుడి వేషం వేస్తే నిజంగా రాముడు ఇలానే ఉండేవారేమో అన్నట్లు ఉండేది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా ఆయన నటిస్తేనే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు.

అయితే ఎన్టీఆర్ యేడాదికి సగటున 10 చిత్రాలు చేసేవారు. అందులో పౌరాణిక చిత్రాలు, జనపద చిత్రాలు, సామాజిక చిత్రాలు ఉండేవి. అయితే ఎన్టీఆర్ 1965లో పది చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా ఇందులో 3 పౌరాణిక చిత్రాల్లో నటించి మంచి విజయం సాధించారు. విరాభిమన్యు మూవీలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, పాండవవనవాసంలో భీముడిగా, ప్రమీలార్జునీయంలో అర్జునుడిగా నటించి విజయం సాధించారు.
కాగా ప్రమీలార్జునీయం సినిమా విషయానికి వస్తే మంగళగిరి మల్లికార్జున రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ యన సీనియర్ నటి శ్రీరంజని కుమారుడు కావడం విశేషం. నాగుమణి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈయనకిది రెండో చిత్రం. కాగా మల్లికార్జున రావు, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. రాణి ప్రమీళాగా సరోజాదేవి నటించారు. ఇందులో శోబన్ బాబు, రేలంగి, కాంతారావు, వాణిశ్రీ, గిరిజ, చాయాదేవి కీలక పాత్రలు పోషించారు. జయమినీ భారతం నుంచి తీసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కించారు.
పురుషద్వేషి అయినా రాణి ప్రమీళా రాజ్యాధికారం చేపట్టి అందరు మహిళలతో కొలువు దీరన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అర్జునుడు ప్రమీళా మనసు మార్చి పట్టపురాణిగా చేసుకోవడం ఈ సినిమా కథాంశం. అయితే షూటింగ్ మధ్యలో సరోజాదేవి ఆనారోగ్యానికి గురికావడంతో కొంత ఆలస్యం జరిగినా తర్వాత షూటింగ్ పూర్తి చేశారు. 1965 జూన్ 11న ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్, సరోజాదేవి జంట అద్బుతంగా నటించారు. అయితే కృష్ణుడి పాత్రలో నటించిన కాంతారావు చెప్పినట్లు.. ఎన్టీఆర్ వినడం అప్పట్లో ప్రేక్షకులకు నచ్చలేదు. ఎన్టీఆర్ వల్లే సినిమా పెద్ద విజయం సాధించిందని చెబుతారు.
Recommended Videos: