https://oktelugu.com/

రాజమౌళి-కీరవాణి కుటుంబంపై ఎన్టీఆర్ హాట్ కామెంట్స్

రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిద్దరూ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఒకే సినిమాతో.. రాజమౌళి తీసిన సినిమాల్లో నాలుగు జూనియర్ ఎన్టీఆర్ తోనే కావడం గమనార్హం. బాహుబలి తీసిన తర్వాత నీ ఫేవరెట్ హీరో ఎవరని ‘రాజమౌళిని’ అడిగితే తడుముకోకుండా ‘తారక్’ అని చెప్పేశాడు జక్కన్న. అంతటి అనుబంధం మరోసారి బయటపడింది. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా.. మరో కొడుకు కాలభైవర సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2021 / 12:05 PM IST
    Follow us on

    రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిద్దరూ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఒకే సినిమాతో.. రాజమౌళి తీసిన సినిమాల్లో నాలుగు జూనియర్ ఎన్టీఆర్ తోనే కావడం గమనార్హం. బాహుబలి తీసిన తర్వాత నీ ఫేవరెట్ హీరో ఎవరని ‘రాజమౌళిని’ అడిగితే తడుముకోకుండా ‘తారక్’ అని చెప్పేశాడు జక్కన్న.

    అంతటి అనుబంధం మరోసారి బయటపడింది. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా.. మరో కొడుకు కాలభైవర సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’ ఈ ప్రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

    ‘నాకు 20 ఏళ్లు నుంచి దేవుడు ఇచ్చిన శక్తి అభిమానులైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న-కీరవాణి కుటుంబం. నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్లే ఉన్నారు. ఆ కుటుంబానికి నేను ఎప్పుడూ అతిథిని కాను.. నేను వారి కుటుంబ సభ్యుడిగానే భావిస్తాను’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

    నా పిల్లలు సక్సెస్ అయితే ఎలా ఫీల్ అవుతారో.. నా తమ్ముళ్లు సింహా-భైరవ విజయాలు సాధిస్తే నేను అలానే ఫీల్ అవుతాను అని ఎన్టీఆర్ అన్నారు. దీన్ని బట్టి వీరి మధ్య అనుబంధం ఏపాటిదో తెలిసిపోయింది..