NTR Heroine: ఒకప్పుడు సోషల్ మీడియా అందుబాటు లో లేని సమయంలో అభిమానులు పేపర్లో వచ్చిన తమకు ఇష్టమైన హీరోయిన్ల ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే పుస్తకాలలో దాచుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతం మొత్తం మారిపోయింది అని చెప్పొచ్చు. ఒకప్పటి హీరోయిన్లు చాలామంది సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు. కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని తమ భర్త పిల్లలతో హ్యాపీగా గడిపేస్తున్నారు. మరి కొంతమంది హీరోయిన్లు సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఒకప్పటి చాలామంది హీరోయిన్లను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా. ఒకప్పుడు సినిమాలతో అలరించి ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ ప్రస్తుతం మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకొని తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఒకప్పుడు క్రేజీ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం షాకింగ్ లుక్ లో మారిపోయి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read: ‘పుష్ప 2’ కి యావరేజ్ టీఆర్ఫీ రేటింగ్స్..ఇంత తక్కువ రావడానికి కారణం అదేనా?
ఒకప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ అలాగే తమిళ్లో సూర్యతో సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈమె మరెవరో కాదు ఒకటి అందాల తార సమీరా రెడ్డి. సమీరా రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రధానంగా హిందీ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించింది. 2005లో రిలీజ్ అయిన నరసింహుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్కు జోడిగా అశోక్ సినిమాలో కూడా నటించే మెప్పించింది సమీరారెడ్డి. కొన్నాళ్ల తర్వాత ఈ చిన్నది ఊహించని విధంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేసే అలరించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత రానా హీరోగా నటించిన కృష్ణము వందే జగద్గురుం అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి అలరించింది సమీరా రెడ్డి. కొంతకాలం తర్వాత హిందీ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. తమిళ్ స్టార్ హీరో సూర్యకు జోడిగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాలో నటించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.
Also Read: చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో!