NTR God Of War : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. కెరియర్ మొదట్లోనే మాస్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు ప్లాప్ లను ముట్టగట్టుకున్నాడు. అయినప్పటికి ఆయన ఎక్కడా తడబడకుండా వరుస సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. టైర్ వన్ హీరోల్లో తను కూడా ఒకడిగా వెలుగొందుతుండటం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్ ‘ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేస్తున్నాడా? లేదంటే అల్లు అర్జున్ తో చేయబోతున్నాడా అనే విషయంలో సరైన క్లారిటి అయితే రావడం లేదు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తున్నారు అంటూ ఒక క్లారిటి కి వచ్చేశారు. తాజాగా దీనిపై అప్టేట్ వచ్చింది.
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నుంచి నేడు సాయంత్రం 5:04 గంటలకు అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తన X ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌ను Jr. NTR అధికారిక ట్విటర్ (X) అకౌంట్ నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్–ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడం, అలాగే కుమారస్వామి కథతో తెరకెక్కనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లనైతే సాధించలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకొని టాప్ డైరెక్టర్ గా మారాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు…
ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ తోనే ప్రకటించబోతున్నారు అనే విషయం పైన ప్రతి ఒక్కరికి క్లారిటి వచ్చింది…
