NTR fans unforgettable May 20: జూన్ 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ని ఆయన అభిమానులు ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, సంబరాలు , బ్యానర్స్ లతో అభిమానులు ఒక పెద్ద పండుగ లాగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ , ఆయన కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా ఇవ్వబోతున్నారు మేకర్స్. ముందుగా మే 20 న, అర్థ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ వీడియో ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ప్రాంతాల్లోనూ LED స్క్రీన్స్ తో ప్రదర్శించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు.
అదే విధంగా అభిమానుల్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి అనుమానాలకు కూడా ఈ పుట్టినరోజు వేడుక ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే కొరటాల శివ బాలయ్య బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘దేవర 2’ ఆగిపోయింది , ఇక ఆ చిత్రం ఉండకపోవచ్చు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అభిమానులు కూడా ‘దేవర 2’ రావడం అసాధ్యం అని ఫిక్స్ అయిపోయారు. అయితే మే 20 న ‘దేవర 2’ కి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారట మేకర్స్. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం చేయబోతున్నట్టు , నిర్మాత నాగవంశీ అధికారిక ప్రకటన చేశాడు. కానీ కొన్నాళ్ళకు ఈ చిత్రం ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
సోషల్ మీడియా లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ , అల్లు అర్జున్ అభిమానులు ఒక రేంజ్ లో ఫ్యాన్ వార్స్ కూడా చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కూడా మే 20 న ఒక కీలక అప్డేట్ రాబోతుంది అట. ఇలా ఒకే రోజున ఒకటి కాదు , రెండు కాదు , ఏకంగా మూడు అప్డేట్స్ రాబోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా , ఈ పుట్టినరోజు మారబోతుంది. వీటితో పాటు ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిల్చిన ‘ఊసరవెల్లి’ చిత్రాన్ని కూడా మే 20 న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ రానుంది, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.