NTR And Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మాత్రం స్టార్ హీరోగా తనకంటూ ఒక స్థాయి నైతి సంపాదించుకున్నాడు… నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… ఇక ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ ను కంప్లీట్. చేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుపుతున్నారు. ఇక ఈ షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడుతున్నాడట. ఈ ఫైట్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందట. అందుకోసమే ప్రశాంత్ నీల్ సైతం చాలా కేర్ ఫుల్ గా ఈ ఫైట్ ని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది…
కేజిఎఫ్, సలార్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ని సాధించాయో అంతకుమించిన సక్సెస్ ని ఈ సినిమా సాధిస్తుందనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నాడు, తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా సాధించలేదు. కాబట్టి తన అభిమానులు సైతం ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కుతుందనే అంచనాలో ఉన్నారు… ప్రశాంత్ నీల్ ఈ సినిమాని సక్సెస్ గా నిలుపుతాడా? తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి త్రివిక్రమ్ తనకు హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కాబట్టి తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మరింత ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది…